మహారాష్ట్రలోని సోలాపూర్ వద్ద ఈ రోజు తెల్లవారు జామున ఘోర ప్రమాదం జరిగింది. సోలాపూర్-పూణె జాతీయ రహదారిపై ఆగివున్న లారీని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న వారికి తీవ్రగాయాలు కావడంతో వెంటనే వారిని సోలాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో ఐదుగురు చికిత్స పోందుతూ మరణించారు. ఆర్టీసీ బస్సు పండర్ పూర్ నుంచి ప్రయాణికులతో హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.