తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఏపీ వాసులు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాంచీపురం జిల్లా చెంగల్‌పట్టు దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా వాసులు ఇద్దరు మృతి చెందారు. పెదనందిపాడు నుంచి అరుణాచలం గుడికి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ధూళిపాళ్ల రాజ్యలక్ష్మి, లావు ఝాన్సీ అక్కడికక్కడే మృతి చెందగా.. ధూళిపాళ్ల మోహనరావు, లావు శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. కాగా క్షతగాత్రులను చెంగల్ పట్టు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Updated on: May 18, 2019 | 9:40 PM