కరోనా కేసులతో రష్యాకు చేరువలో మహారాష్ట్ర

|

Sep 11, 2020 | 6:37 PM

కరోనా కేసులతో మహారాష్ట్ర ఉగ్రరూపం దాల్చుతోంది. నిత్యం నమోదవుతున్న కేసులతో ప్రభుత్వంతో పాటు జనం బెంబేలెత్తుతున్నారు. దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి.

కరోనా కేసులతో రష్యాకు చేరువలో మహారాష్ట్ర
Follow us on

కరోనా కేసులతో మహారాష్ట్ర ఉగ్రరూపం దాల్చుతోంది. నిత్యం నమోదవుతున్న కేసులతో ప్రభుత్వంతో పాటు జనం బెంబేలెత్తుతున్నారు. దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం పది లక్షల కేసులతో దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కరోనా కేసుల్లో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న రష్యాతో మహారాష్ట్ర పోటీపడుతోంది. ప్రతిరోజు 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అటు దేశంలోనూ అంతకంతకు పెరుగుతున్న కొవిడ్ పాజిటివ్ కేసులతో 50 లక్షలు దాటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రికార్డు చేరుకునేందుకు ఎంత దూరం లేదంటున్నారు. వచ్చే నెల నాటికి అమెరికాను కూడా అధిగమించి తొలి స్థానానికి కూడా చేరుకునే అవకాశం ఉందని అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. ఇక మహారాష్ట్రలో ప్రస్తుతం 9,90,795 కేసులు నమోదయ్యాయి. ఇందులో 28,648 మంది కరోనాను జయించలేక మృత్యువాత పడ్డారు. కాగా, ఇప్పటి వరకు కరోనా బారి నుంచి 7,00,715 మంది బయటపడ్డారు. అయితే, కరోనా కట్టడిలో మహారాష్ట్ర సర్కార్ విఫల ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం పట్టణాల నుంచి పల్లెలకు కరోనా వ్యాప్తి చెందుతుండడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక, రోగుల చికిత్సతో పాటు ప్రాణాలను నిలిపేందుకు వైద్యులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అటు ప్రభుత్వ యంత్రాంగం అన్నివిధాలుగా మెరుగైన వైద్యం అందించేందుకు కృషీ చేస్తోంది. ముఖ్యంగా మరణాల రేటును తగ్గేందుకు ప్రయత్నిస్తోంది.