హజూర్ సాహిబ్‌ యాత్రికులలో.. 60 మందికి కరోనా పాజిటివ్..

| Edited By:

May 04, 2020 | 3:45 PM

కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. లాక్‌డౌన్ కారణంగా నాందేడ్‌లో చిక్కుకుపోయిన పంజాబ్ యాత్రికులకు మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 పరీక్షలు

హజూర్ సాహిబ్‌ యాత్రికులలో.. 60 మందికి కరోనా పాజిటివ్..
Follow us on

కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. లాక్‌డౌన్ కారణంగా నాందేడ్‌లో చిక్కుకుపోయిన పంజాబ్ యాత్రికులకు మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 పరీక్షలు చేయకపోవడాన్ని పంజాబ్ ప్రభుత్వం తప్పుపట్టింది. ఇందువల్ల తమకు మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయని పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధు అన్నారు. కోవిడ్-19 హబ్‌గా మహారాష్ట్ర మారిన పరిస్థితిలో పంజాబ్ యాత్రికులకు పరీక్షలు నిర్వహించకపోవడం తమకు మరింత ఇబ్బందికరంగా మారిందని అన్నారు.

కాగా.. మహారాష్ట్రలో కరోనా కరాళనృత్యం చేస్తోన్న నేపథ్యంలో.. పంజాబ్ యాత్రికులకు పరీక్షలు చేయనప్పుడు ఆ విషయం మాకు తెలియజేస్తే బాగుండేది. అందుకు తగ్గట్టుగానే మేము ఏర్పాట్లు చేసుకునే వాళ్లం’ అని సిద్ధూ అన్నారు. నాందేడ్ నుంచి పంజాబ్‌లోని హజూర్ సాహిబ్‌కు మొత్ం 130 మంది యాత్రికులు తిరిగి రాగా, వారిలో 63 మందికి కోవిద్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు డిప్యూటీ కమిషనర్ వినయ్ బులానీ తెలిపారు. కాగా, పంజాబ్‌లో 1102 కోవిద్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 117 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్చ్ అయ్యారు. 21 మంది మృత్యువాత పడ్డారు.