
ఇప్పుడు మీకు గజదొంగలు కాదు వాళ్ల బాబులను పరిచయం చేయబోతున్నాం. ఎవడైనా దొంగతనం చేస్తే, పోలీస్ స్టేషన్‌లో పెడతారు. ఇక అదే పోలీస్ స్టేషన్‌లో దొంగతనం చేస్తే..వారిని ఎక్కడ పెట్టాలి. మహారాష్ట్రలో కొల్హాపూర్ జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఇటువంటి విచిత్ర ఘటనే చోటు చేసుకుంది. ఖాకీలను ఈ ఘటన నిద్రలో కూడా వెంటాడుతోంది. ఎందుకంటే దొంగలు చిన్న, చిన్న సామాన్లు చోరీ చెయ్యలేదు. స్టోర్ రూమ్ నుంచి ఏకంగా 180 సెల్‌ఫోన్లను కొట్టేశారు. కొల్హాపూర్ దగ్గర్లోని జైసింగ్‌పూర్ పీఎస్‌లో ఈ దొంగతనం జరిగింది. రకరకాల కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఫోన్లను స్టోర్ రూమ్‌లో ఉంచారు పోలీసులు. పోయిన గురువారం రాత్రి పక్కా స్కెచ్ వేసుకున్న దుండగులు, ఆ గదిలోకి ప్రవేశించి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. చేసేదేం లేక కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు అదే స్టేషన్ పోలీసులు.