మహాప్రస్థానం టీజర్ రిలీజ్

తనీష్ హీరోగా నటిస్తున్న 'మహాప్రస్థానం' మూవీ టీజర్ రిలీజైంది. సెప్టెంబర్ 7న తనీష్ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ ను మూవీ యూనిట్ ప్రేక్షకుల ముందుకు తెచ్చింది...

మహాప్రస్థానం టీజర్ రిలీజ్

Updated on: Sep 07, 2020 | 1:10 PM

తనీష్ హీరోగా నటిస్తున్న ‘మహాప్రస్థానం’ మూవీ టీజర్ రిలీజైంది. సెప్టెంబర్ 7న తనీష్ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ ను మూవీ యూనిట్ ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. జాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ టీజర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ముస్కాన్ సేథీ హీరోయిన్ గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో వరుడు ఫేమ్ భాను శ్రీ మెహ్రా కనిపించనుంది. ఈ మూవీలో రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు మాటలు – వసంత కిరణ్, యానాల శివ, పాటలు – ప్రణవ్, సంగీతం – సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ – ఎంఎన్ బాల్ రెడ్డి, కథా కథనం దర్శకత్వం జాని.