బాలుడు దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్ విషాదంతం

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) కిడ్నాప్‌ కథ విషాదాంతమైంది.

బాలుడు దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్ విషాదంతం
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 22, 2020 | 10:29 AM

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) కిడ్నాప్‌ కథ విషాదాంతమైంది. కేససముద్రం మండలం అన్నారం శివారులోని గుట్టపై బాలుడి మృత దేహాన్ని గురువారం ఉదయం పోలీసులు గుర్తించారు. బాలుడి మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా.. పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బంధువులు మనోజ్‌ రెడ్డి, సాగర్‌పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లో ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. గత ఆదివారం ఇంటి దగ్గర దీక్షిత్‌ను దుండగులు కిడ్నాప్‌ చేశారు. బాలుడు దీక్షిత్‌ విడుదలకు రూ.45 లక్షలను కిడ్నాపర్లు డిమాండ్‌ చేశారు.