‘ఆ ‘ఇంజక్షన్’తో కరోనా రోగులకు తప్పిన ప్రాణాపాయం..!

| Edited By:

May 04, 2020 | 1:32 PM

కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పుడు భారత్ లో విజృంభిస్తోంది. అయితే.. తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్‌కు గురైన వారిపై ‘ఇటోలీజుమ్యాబ్‌’ అనే ఔషధం ప్రభావవంతంగా పనిచేస్తోందని ముంబైలోని

‘ఆ ఇంజక్షన్తో కరోనా రోగులకు తప్పిన ప్రాణాపాయం..!
Follow us on

Skin disease drug: కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పుడు భారత్ లో విజృంభిస్తోంది. అయితే.. తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్‌కు గురైన వారిపై ‘ఇటోలీజుమ్యాబ్‌’ అనే ఔషధం ప్రభావవంతంగా పనిచేస్తోందని ముంబైలోని నాయిర్‌ హాస్పిటల్‌ ప్రకటించింది. ఇద్దరు రోగులకు దీన్నిఅందించగా వెంటిలేటర్‌ దశ నుంచి సాధారణ స్థితికి చేరుకున్నట్లు వెల్లడించింది. బయోకాన్‌ కంపెనీ ఉత్పత్తి చేసే ఈ మందు ఒక్క డోసు ధర రూ.60 వేలు. బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)లోని ఆస్పత్రుల్లో ప్రయోగ పూర్వకంగా వాడేందుకు ‘ఇటోలిజుమ్యాబ్‌’ను ఉచితంగా ఇస్తామని ఆ సంస్థ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా ప్రకటించారు.

మరోవైపు.. కింగ్‌ ఎడ్వర్డ్‌ స్మారక ఆస్పత్రిలో ఓ 35 ఏళ్ల కరోనా రోగి(డ్రైవర్‌)కు ఈ ఔషధాన్ని అందించే ప్రక్రియను ప్రారంభించారు. మరో 125 మంది నిరుపేద రోగులకు ‘ఇటోలీజుమ్యాబ్‌’ను అందించేందుకు బీఎంసీ యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. ముందు రోగుల కాలేయం, కిడ్నీల పనితీరును పరీక్షించిన తర్వాతే ఈ మందు ఇస్తారు. కొందరు రోగులకు ఒకడోసు సరిపోతుండగా, ఇంకొందరికి మూడు డోసుల దాకా ఇవ్వాల్సి వస్తోందని తెలిపింది. ఈ లెక్కన ఒక డోసుకు రూ.60వేల చొప్పున 3 డోసులకు రూ.1.80 లక్షల దాకా ఖర్చవుతుంది.