లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా కొత్త చట్టంః ఎంపీ సీఎం
మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. వివాహం ద్వారా ప్రజల మతాన్ని మార్చడానికి కుట్ర పన్నే వారిపై కొత్త చట్టం తీసుకువస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ప్రేమ వివాహం పేరిట ఇతరుల మతాన్ని మార్చడానికి కుట్ర చేసేవారికి వ్యతిరేకంగా మేం మధ్యప్రదేశ్‌లో కఠినమైన చట్టాన్ని తీసుకువస్తున్నామన్నారు. లవ్ జిహాద్ పేరుతో జరిగేవాటిని ఏమాత్రం సహించబోమన్నారు. త్వరలో మధ్యప్రదేశ్ వ్యాప్తంగా ఈ చట్టం అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి చౌహాన్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నాయి అయా రాష్ట్ర ప్రభుత్వాలు. లవ్ జిహాద్‌ను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానున్నామని ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు గతంలోనే ప్రకటించాయి. లవ్ జిహాద్ ఘటనలకు పాల్పడే వారు తమ పద్ధతులు మార్చుకోకుంటే వారికి అంతిమయాత్ర మొదలవుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గతంలో హెచ్చరించారు. లవ్ జిహాద్ కేసులకు చెక్ పెట్టడానికి కేంద్రం మార్గాలను పరిశీలిస్తుందని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.