మేడ్-ఇన్-ఇండియా గురూ..! రోబోటిక్ సిస్టమ్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి కార్డియాక్ టెలిసర్జరీ..

వైద్య పరిభాషలో సంచలనం.. ప్రపంచంలోనే తొలిసారి రోబోటిక్ కార్డియాక్ టెలిసర్జరీ నిర్వహించారు భారతీయ వైద్య బృందం. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించని రోబోటిక్ బీటింగ్ హార్ట్ టోటల్‌గా ఎండోస్కోపిక్ కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ. మేడ్-ఇన్-ఇండియా సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ టెలిసర్జరీ ద్వారా 286 కిలోమీటర్ల దూరంలో రెండు రోబోటిక్ కార్డియాక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు.

మేడ్-ఇన్-ఇండియా గురూ..! రోబోటిక్ సిస్టమ్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి కార్డియాక్ టెలిసర్జరీ..
Robotic Telesurgeries
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 11, 2025 | 5:32 PM

సంచలనాత్మక ప్రయోగంతో భారత వైద్యరంగం మరో గొప్ప విజయం సాధించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, రోబోటిక్ బీటింగ్ హార్ట్ పూర్తిగా ఎండోస్కోపిక్ కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ నిర్వహించింది. మేడ్-ఇన్-ఇండియా రోబోటిక్ సిస్టమ్‌తో అత్యంత సంక్లిష్టమైన కార్డియాక్ సర్జరీ నిర్వహించిన సక్సెస్ అయ్యారు. మేడ్-ఇన్-ఇండియా సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ టెలిసర్జరీ ద్వారా 286 కిలోమీటర్ల దూరంలో రెండు రోబోటిక్ కార్డియాక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది.

ప్రపంచంలోనే మొదటి రెండు రోబోటిక్ కార్డియాక్ టెలిసర్జరీలను కేవలం రెండు రోజుల్లో విజయవంతంగా నిర్వహించడం ద్వారా భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సర్జికల్ రోబోటిక్ టెక్నాలజీ ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో చరిత్ర సృష్టించింది. 3 సర్జికల్ రోబోటిక్ సిస్టమ్‌ల ద్వారా రిమోట్‌గా శస్త్రచికిత్సలు నిర్వహించారు. గురుగ్రామ్‌లోని SS ఇన్నోవేషన్ ప్రధాన కార్యాలయాన్ని 286 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అనుసంధానించడం జరిగింది. టెలిరోబోటిక్ అసిస్టెడ్ ఇంటర్నల్ మర్మారీ ఆర్టరీ హార్వెస్టింగ్ ప్రక్రియ రిమోట్‌గా కేవలం 58 నిమిషాల్లో సర్జరీ విజయవంతంగా పూర్తయింది. SS ఇన్నోవేషన్స్ ఇంటర్నేషనల్ ఇంక్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, CEO డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ దీనికి నాయకత్వం వహించారు. గురుగ్రామ్‌లోని ఎస్‌ఎస్‌ఐ ప్రధాన కార్యాలయం నుండి జరిగింది. జైపూర్‌లోని మణిపాల్ హాస్పిటల్‌లోని కార్డియాక్ సర్జరీ హెడ్ డాక్టర్ లలిత్ మాలిక్ తోసహా ఇతర నిపుణుల బృందం మద్దతుతో శస్త్రచికిత్సకు 35-40 మిల్లీసెకన్లు తక్కువ వ్యవధిలోనే అసాధారణమైన ఖచ్చితత్వాన్ని ప్రదర్శించింది.

గుండె శస్త్రచికిత్స ప్రక్రియ

ఈ సంచలనాత్మక ప్రక్రియను అనుసరించి మరొక ప్రపంచ మొట్టమొదటి, రోబోటిక్ బీటింగ్ హార్ట్ టోటల్‌గా ఎండోస్కోపిక్ కరోనరీ ఆర్టరీ బైపాస్ (TECAB). ఈ ప్రక్రియ అత్యంత క్లిష్టమైన కార్డియాక్ సర్జికల్ విధానాలలో ఒకటిగా గుర్తించారు. ఇది కేవలం 40 మిల్లీసెకన్ల అతి తక్కువ సమయంతో టెలిసర్జరీ ద్వారా నిర్వహించారు. ‘మానవాళికి ప్రయోజనం చేకూర్చే విధంగా శస్త్రచికిత్స సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి చాలా సంతోషిస్తున్నామని SS ఇన్నోవేషన్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ అన్నారు. ముఖ్యంగా ఇది చాలా అవసరమైన ప్రాంతాలలో. టెలిసర్జరీని ప్రారంభించడం ద్వారా, వైద్య నైపుణ్యం పొందడంలో ఉన్న అంతరాన్ని తగ్గించగలమన్నారు. భౌగోళిక అవరోధాలు ఉన్నప్పటికీ అత్యున్నత ప్రమాణాల సంరక్షణను అందించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

సాధించిన విజయాల గురించి SS ఇన్నోవేషన్స్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ స్పందిస్తూ, టెలిసర్జరీ ప్రయోజనాలను వివరించారు. ఇది రోగులకు మునుపటి కంటే సంరక్షణను సులభతరం చేస్తుంది. గ్రామీణ జనాభా, గణనీయమైన ఆరోగ్య సంరక్షణ అసమానతలు కలిగిన భారతదేశం వంటి దేశానికి, ఈ ఆవిష్కరణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. టెలిసర్జరీ ప్రపంచ స్థాయి శస్త్రచికిత్సా నైపుణ్యాన్ని నేరుగా తక్కువ సేవలందించే కమ్యూనిటీలకు అందిస్తుంది. రోగులు ప్రత్యేక సంరక్షణ కోసం పట్టణ కేంద్రాలకు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. రోబోటిక్ సర్జరీ ద్వారా సుదూర ప్రాంతాల్లోని వారి ప్రాణాలను కాపాడాలన్న సంకల్పంతోనే ఈ మిషన్‌ను పూర్తి చేసామని శ్రీవాస్తవ తెలిపారు.

‘అపూర్వమైన ఇంటర్-స్టేట్ రోబోటిక్ కార్డియాక్ టెలిసర్జరీ ఆవిష్కరణ ద్వారా రోగుల సంరక్షణను మెరుగుపరచడంలో ఇది గణనీయమైన పురోగతి అని జైపూర్‌లోని మణిపాల్ హాస్పిటల్‌లోని కార్డియాక్ సర్జరీ హెడ్ డాక్టర్ లలిత్ మాలిక్ తెలిపారు. జైపూర్‌లోని వృద్ధ రోగిపై రిమోట్ రోబోట్-సహాయక CABG అనేది ఖచ్చితమైన, సమయానుకూల వైద్య అందించడానికి సాంకేతికత భౌగోళిక అంతరాన్ని ఎలా భర్తీ చేస్తుందో చెప్పడానికి ఒక ఉదాహరణ అన్నారు. ఈ విజయం ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందించడంలో రోగులకు అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన చికిత్స’ అని పేర్కొన్నారు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..