నవరత్నాల పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఎం శామ్యూల్‌ని ‘నవరత్నాల పథకం అమలు’కు వైస్ ఛైర్మన్‌గా సీఎం నియమించారు. నవరత్నాల పథకంను సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎం శామ్యూల్ సీఎం సలహాదారుగా ఇప్పటికే బాధ్యతలు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమం అమలు చేయడంలో భాగంగా అన్ని శాఖలతో శామ్యూల్ సమన్వయం చేయనునున్నారు. కేబినెట్ ర్యాంక్ హోదాలో ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా.. నవరత్నాల పథకం అమలు బాధ్యతను నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకురాలి రోజాకి ఇస్తారనే ఊహాగానాలకు తెరపడిందనే చెప్పాలి.