రోడ్డుపక్కన లారీల నిండా కండోమ్‌లు! ఎక్కడివంటే?

| Edited By:

Dec 28, 2019 | 7:32 PM

ఓ ఇటుక బట్టీలోకి సడన్‌గా కొన్ని లారీలు వచ్చాయి. వేగంగా లారీలో ఉన్న లోడ్‌ని దించేశారు లారీ డ్రైవర్లు. ఆ లోడ్‌ని చూసి షాక్ అయి వారితో.. స్థానికులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఇంతకీ లారీలో ఏమున్నాయనే కదా మీ డౌట్! ఆ లారీల నిండా కండోమ్స్ ఉన్నాయి. అవును.. మీరు చదువుతుంది నిజమే! అయితే ఇన్ని కండోమ్స్ ఎక్కడివని అందరూ తమ వంతు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ ఉన్నావ్‌లోని సోహరామావ్‌లో మూసివేసిన […]

రోడ్డుపక్కన లారీల నిండా కండోమ్‌లు! ఎక్కడివంటే?
Follow us on

ఓ ఇటుక బట్టీలోకి సడన్‌గా కొన్ని లారీలు వచ్చాయి. వేగంగా లారీలో ఉన్న లోడ్‌ని దించేశారు లారీ డ్రైవర్లు. ఆ లోడ్‌ని చూసి షాక్ అయి వారితో.. స్థానికులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఇంతకీ లారీలో ఏమున్నాయనే కదా మీ డౌట్! ఆ లారీల నిండా కండోమ్స్ ఉన్నాయి. అవును.. మీరు చదువుతుంది నిజమే! అయితే ఇన్ని కండోమ్స్ ఎక్కడివని అందరూ తమ వంతు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ ఉన్నావ్‌లోని సోహరామావ్‌లో మూసివేసిన ఇటుక బట్టీకి కొన్ని లారీలు వచ్చాయి. అందులో ఉన్న కండోమ్స్ లోడ్‌ని అక్కడ దించాయి. వాటిని చూసి స్థానికులు ఆగ్రహానికి గురై.. లారీ డ్రైవర్లతో వాగ్వాదానికి దిగారు. అయితే.. అవన్నీ కాలం చెల్లిన కండోమ్స్ అని.. లక్నో గవర్నమెంట్ ఆస్పత్రికి చెందినవని.. తమను అడ్డుకోవద్దని,  వీటిని ఇక్కడ పడేసి తగుల బెట్టాలని లారీ డ్రైవర్లు పేర్కొన్నారు.

అయితే.. అందుకు స్థానికులు ఒప్పుకోలేదు. వీటిని కాల్చడం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయని వేరే ప్రదేశానికి తీసుకెళ్లాలని గొడవకు దిగారు స్థానికులు. అక్కడికి మరికొంతమంది గ్రామస్థులు చేరుకోవడం చూసి.. లారీ డ్రైవర్లు మెల్లగా జారుకున్నారు. అయితే ఇప్పుడు వాటితో ఎన్ని ప్రమాదాలు వస్తాయో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు.

లక్నో ప్రభుత్వ ఆసుపత్రిలో గడువు తీరిన కండోమ్‌లు భారీ స్థాయిలో నిల్వ ఉన్నాయి. వీటిని ఫ్రీగా ప్రజలకు పంచేది ఈ ఆస్పత్రి. అయితే.. గడువు సమయం అయిపోవడంతో వీటిని తీసుకునేందుకు నగర పాలక సంస్థ నిరాకరించిందట. దీంతో వీటిని నిర్మానుష్య ప్రదేశంలో పడేయాలని ఆసుపత్రి వర్గాలు నిర్ణయించాయి. ఈ మేరకు వాటిని సోహరామావ్‌లోని ఇటుక బట్టీలో పడేశాయి.