జనం నెత్తిన గ్యాస్ బండ..భారీగా పెరిగిన సిలిండర్ ధర

మధ్యతరగతి ప్రజలకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు అల్లాడిస్తూ ఉండగా..తాజాగా వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. ఎల్‌పీజీ సిలిండర్ కొత్తగా పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి. సిలిండర్ ధర ఏకంగా రూ.76 మేర పెరిగింది. ఇండియన్ ఆయిల్ లేటెస్ట్ ధరల జాబితా ప్రకారం తాజా ధరలు: ఇండేన్ గ్యాస్ 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు             […]

జనం నెత్తిన గ్యాస్ బండ..భారీగా పెరిగిన సిలిండర్ ధర

Updated on: Nov 01, 2019 | 3:44 PM

మధ్యతరగతి ప్రజలకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు అల్లాడిస్తూ ఉండగా..తాజాగా వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. ఎల్‌పీజీ సిలిండర్ కొత్తగా పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి. సిలిండర్ ధర ఏకంగా రూ.76 మేర పెరిగింది. ఇండియన్ ఆయిల్ లేటెస్ట్ ధరల జాబితా ప్రకారం తాజా ధరలు:

ఇండేన్ గ్యాస్ 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు

                            నవంబర్      అక్టోబర్

ఢిల్లీ                          681.5            605

కోల్ కతా                    706             630

ముంబై                       651             574.5

చెన్నై                          696              620

 

అక్టోబర్ నెలలో ఎల్‌పీజీ సిలిండర్ ధరలు రూ.15 మేర పెరిగింది. సెప్టెంబర్ నెలలో రూ.15.5 పైకి కదిలింది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా ఒకటో తారీఖున పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఈ ఏడాది సిలిండర్ ధరలు పెరగడం ఇది వరుసగా మూడో సారి. గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా ఎల్‌పీజీ సిలిండర్ రేట్లను సమీక్షిస్తూ ఉంటాయి. సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌పీజీ రేట్లు, అమెరికా డాలర్-ఇండియన్ రూపాయి మారకపు విలువ వంటి అంశాలు ప్రాతిపదికన ధరను మారుస్తూ ఉంటాయి.