కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ ముల్లంగిలో గణపతి ఆకారం దర్శనమిచ్చింది. బొజ్జగణపయ్య రూపం, తొండంతో స్పష్టంగా కనిపించాడు. దీంతో ఇదంతా వినాయక మహిమేనంటూ స్థానికులు పూజలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నందిగామ పట్టణానికి చెందిన పబ్బతి రామచంద్ర రావు రైతు బజార్ కూరగాయల మార్కెట్‌లో ముల్లంగి కొనుగోలు చేశాడు. అందులో ఓ కాయ గణపతి ఆకారంలో కనిపించింది. తోండము, బోజ్జ, కాళ్లు, చేతులు, తల ఉండటం గమనించిన రామచంద్రరావు సాక్షాత్తు వినాయకుడు రూపమేనని భావించాడు. ఆ ముల్లంగికి స్నానం చేయించి పూజలు నిర్వహించారు. సాక్షాత్తూ గణపతి ఆకారంలో ఉన్న ముల్లంగి తన పూజామందిరంలో నిలిపి ప్రత్యేక పూజాలు చేశారు.
ఈ గణపతి ఆకారంలో ఉన్న ముల్లంగి విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో చుట్టు పక్కల ప్రజలు ఈ వింతైన ఘటనను చూసేందుకు రామచంద్రరావు ఇంటికి చేరుకుంటున్నారు.
Also Read :