ఐపీఎల్ 2021 మినీ వేలం.. చెన్నై సూపర్ కింగ్స్ విడిచిపెట్టే ప్లేయర్స్ జాబితా ఇదే.!

Chennai Super Kings: ఐపీఎల్ 2021 కోసం పనులు శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే జనవరి 21వ తేదీలోగా వేలం...

  • Ravi Kiran
  • Publish Date - 5:26 pm, Sun, 10 January 21
ఐపీఎల్ 2021 మినీ వేలం.. చెన్నై సూపర్ కింగ్స్ విడిచిపెట్టే ప్లేయర్స్ జాబితా ఇదే.!

Chennai Super Kings: ఐపీఎల్ 2021 కోసం పనులు శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే జనవరి 21వ తేదీలోగా వేలం కోసం రిలీజ్ చేసే ఆటగాళ్ల లిస్టును సిద్దం చేయాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ సుమారు 7-8 మంది ఆటగాళ్లను విడిచిపెట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక ఆ ప్లేయర్స్ వీళ్లేనని ఓ లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేదార్‌ జాదవ్‌(7.8కోట్లు), కర్ణ శర్మ(5కోట్లు), పీయూష్ చావ్లా(6.75కోట్లు), హర్భజన్‌ సింగ్‌(2కోట్లు), మురళీ విజయ్‌(2కోట్లు), డ్వేన్‌ బ్రావో(6.4కోట్లు, ఫిట్‌గా లేకపోతే), జోష్‌ హేజిల్‌వుడ్‌(2కోట్లు), ఇమ్రాన్‌ తాహిర్‌(1 కోటి)లను విడిచిపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.

కాగా, టీ20 నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మాలన్, వచ్చే ఏడాదితో కాంట్రాక్ట్ పూర్తవుతున్న సురేష్ రైనాలపై సీఎస్కే గురి పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈసారి మళ్లీ టాప్ స్థానాన్ని దక్కించుకునేందుకు మంచి ప్లేయర్లను వేలంలో కొనుగోలు చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ప్రణాళికలు సిద్దం చేస్తోంది.