లోక్‌పాల్‌ వెబ్‌సైట్‌ ప్రారంభం

| Edited By:

May 16, 2019 | 9:46 PM

రెండు నెలల క్రితం ఏర్పాటైన లోక్‌పాల్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ గురువారం ప్రారంభమైంది. లోక్‌పాల్‌ మొదటి ఛైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ దీనిని ప్రారంభించారు. ఈ మేరకు గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ వెబ్‌సైట్‌లో లోక్‌పాల్‌ విధానాలను, పనితీరును పొందుపరచినట్లు తెలిపారు. 2013లో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు లోక్‌పాల్‌-లోకాయుక్త చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు అక్రమాలకు పాల్పడితే ఇకపై లోక్‌పాల్‌, లోకాయుక్త పరిధిలో విచారణ జరుగుతుంది. ఈ […]

లోక్‌పాల్‌ వెబ్‌సైట్‌ ప్రారంభం
Follow us on

రెండు నెలల క్రితం ఏర్పాటైన లోక్‌పాల్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ గురువారం ప్రారంభమైంది. లోక్‌పాల్‌ మొదటి ఛైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ దీనిని ప్రారంభించారు. ఈ మేరకు గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ వెబ్‌సైట్‌లో లోక్‌పాల్‌ విధానాలను, పనితీరును పొందుపరచినట్లు తెలిపారు. 2013లో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు లోక్‌పాల్‌-లోకాయుక్త చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు అక్రమాలకు పాల్పడితే ఇకపై లోక్‌పాల్‌, లోకాయుక్త పరిధిలో విచారణ జరుగుతుంది. ఈ లోక్‌పాల్‌కు కార్యరూపం తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం 2019 మార్చి 19న మొదటి లోక్‌పాల్‌ను ఏర్పాటు చేసి జస్టిస్‌ చంద్ర ఘోష్‌ను ఛైర్మన్‌గా నియమించింది. మొదటి ఛైర్మన్‌గా ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సమక్షంలో మార్చి 23న ప్రమాణ స్వీకారం చేశారు. http://lokpal.gov.in లో ఈ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.