వీడియోకాల్​లోనే భర్త అంత్యక్రియలకు…ఎంత త‌ల్లడిల్లిందో ఆమె

|

Apr 19, 2020 | 10:21 AM

క‌రోనా మ‌నుషుల‌పై క‌న‌ప‌డ‌కుండా దాడి చేస్తోంది. ప్ర‌పంచంలోని 200 పైగా దేశాలు ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ పై పోరాడుతున్నాయి. మ‌రోవైపు క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ విధించ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒక‌చోట నుంచి మ‌రోచోట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌స్తుత‌ పరిస్థితుల్లో ఓ మహిళ తన భర్త చనిపోతే కనీసం ద‌గ్గ‌రుండి ఆఖ‌రి చూపు చూడ‌లేక‌పోయింది అంత్యక్రియలకూ నోచుకోని పరిస్థితి తలెత్తింది. మహారాష్ట్రలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. […]

వీడియోకాల్​లోనే భర్త అంత్యక్రియలకు...ఎంత త‌ల్లడిల్లిందో ఆమె
Follow us on

క‌రోనా మ‌నుషుల‌పై క‌న‌ప‌డ‌కుండా దాడి చేస్తోంది. ప్ర‌పంచంలోని 200 పైగా దేశాలు ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ పై పోరాడుతున్నాయి. మ‌రోవైపు క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ విధించ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒక‌చోట నుంచి మ‌రోచోట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌స్తుత‌ పరిస్థితుల్లో ఓ మహిళ తన భర్త చనిపోతే కనీసం ద‌గ్గ‌రుండి ఆఖ‌రి చూపు చూడ‌లేక‌పోయింది అంత్యక్రియలకూ నోచుకోని పరిస్థితి తలెత్తింది.

మహారాష్ట్రలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన భర్త చివ‌రిసారి చూపుల‌కు నోచుకోని ఆ మహిళ.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చింది. వాసంతి బండేకర్, చంద్రకాంత్ దంపతులు సింధ్​దుర్గ్​ జిల్లా, దోడామార్గ్​లోని మోర్లే గ్రామంలో నివ‌శిస్తున్నారు. తన కుమారుడు అమిత్​ను చూసేందుకు కొన్ని రోజులు వెళ్లారు చంద్రకాంత్. అయితే.. ఆరోగ్య ప‌రిస్థితి బాగోక‌పోవ‌డంతో మార్చి 22న అక్కడే ఆస్పత్రిలో చేరగా చంద్రకాంత్ కి క్యాన్సర్​ అని తేలింది. చికిత్స పొందుతూ ఈ నెల 16న ప్రాణాలు విడిచారు. అయితే ముంబైకి సుమారు 490 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసంతికి.. లాక్​డౌన్​ నిబంధ‌న‌ల వ‌ల్ల‌ ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి ఏర్ప‌డింది. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారానే తన భర్త అంత్యక్రియలకు హాజరైంది. లాక్​డౌన్​ కారణంగా.. తన తండ్రి భౌతిక‌కాయాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లలేక‌పోయాన‌ని, తల్లికి ఆఖ‌రి చూపు కూడా అందించ‌లేక‌పోయాన‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నాడు అమిత్​.