చైనీయులు వాడేవన్నీ ప్రత్యేక యాప్‌లేనట..
భారత ప్రభుత్వం ఇటీవల టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్ యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. హలో, క్యామ్ స్కానర్, షేర్ ఇట్ వంటి యాప్స్ ఈ లిస్టులో ఉన్నాయి. వీటిపై భారతీయులు ఎక్కువగా ఆధారపడినా.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ ఏకీభవించారు. ఇదిలా ఉంటే ఈ యాప్స్ బ్యాన్ అంశం చైనాపై పెద్దగా ప్రభావం ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే ఆ దేశంలో భారతీయులు వాడే యాప్స్ వాడరట. అన్నీ కూడా ప్రత్యేక యాప్‌లనే ఉపయోగిస్తారట. […]
భారత ప్రభుత్వం ఇటీవల టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్ యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. హలో, క్యామ్ స్కానర్, షేర్ ఇట్ వంటి యాప్స్ ఈ లిస్టులో ఉన్నాయి. వీటిపై భారతీయులు ఎక్కువగా ఆధారపడినా.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ ఏకీభవించారు. ఇదిలా ఉంటే ఈ యాప్స్ బ్యాన్ అంశం చైనాపై పెద్దగా ప్రభావం ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే ఆ దేశంలో భారతీయులు వాడే యాప్స్ వాడరట. అన్నీ కూడా ప్రత్యేక యాప్‌లనే ఉపయోగిస్తారట. ప్రపంచంలో అత్యధిక మంది వాడే సెర్చ్ ఇంజన్ గూగుల్, వాట్సాప్, యూట్యూబ్‌లను కూడా చైనాలో ఉపయోగించరని తెలుస్తోంది. భారతీయులు ఎక్కువగా విదేశాలకు చెందిన అప్లికేషన్లనే ఉపయోగిస్తారు. వాటికి ప్రత్యామ్నాయంగా సరికొత్త యాప్స్‌ను చైనా దేశస్తులు వాడుతున్నారట.
- గూగుల్‌కు – బైడు సెర్చ్ ఇంజన్
- వాట్సాప్ – క్యూక్యూ మెసేజింగ్ యాప్
- ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు – వీ చాట్
- యూట్యూబ్ – యూకు.కమ్
- ట్విట్టర్ – విబో
- గూగుల్ మ్యాప్స్ – బైడు మ్యాప్స్