మద్యం ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్

|

May 02, 2020 | 7:17 PM

మద్యం అమ్మకాల సంగతి ఏమో కాని సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఉత్పత్తికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత నలభై అయిదు రోజులుగా మూతపడిన డిస్టిల్లరీలలో సోమవారం నుంచి మద్యం ఉత్పత్తిని ప్రారంభం కాబోతోంది.

మద్యం ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్
Follow us on

మద్యం అమ్మకాల సంగతి ఏమో కాని సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఉత్పత్తికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత నలభై అయిదు రోజులుగా మూతపడిన డిస్టిల్లరీలలో సోమవారం నుంచి మద్యం ఉత్పత్తిని ప్రారంభం కాబోతోంది. డిస్టిల్లరీలు ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో సోమవారం నుంచి మద్యం ఉత్పత్తి ప్రారంభిస్తాయి. లిక్కర్ అమ్మకాలు ఊపందుకునే సంకేతాలు కనిపించడంతో మద్యం ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం.

రాష్ట్ర పరిశ్రమల శాఖ శనివారం మద్యం ఉత్పత్తికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న 14 డిస్టిల్లరీలకు మద్యం ఉత్పత్తికి అనుమతిస్తూ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు వెలువరించింది.

అయితే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఈ 14 డిస్టిలరీలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. సామాజిక దూరాన్ని పాటించడం, మాస్కులను ధరించడంతో పాటు సిబ్బంది నియమిత సంఖ్యలోనే విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనలకు అనుగుణంగా సోమవారం నుంచి మద్యం ఉత్పత్తిని ప్రారంభించుకోవచ్చునని రాష్ట్ర పరిశ్రమల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.