#COVID19 ఇంటికే లిక్కర్ కావాలంట! మందుబాబుకు హైకోర్టు మొట్టికాయ

|

Mar 20, 2020 | 4:21 PM

దేశమంతా కరోనా భయాందోళనతో వణికిపోతుంటే.. మందు బాబుల అతి తెలివి తేటలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. తమిళనాడులో క్యూ వరుసలో తమదైన తెలివిని ప్రదర్శించిన ఉదంతం మరచిపోకముందే.. కేరళలో ఓ మందు బాబు అతి తెలివి ప్రదర్శించి ఏకంగా హైకోర్టులో చివాట్లు తిని..

#COVID19 ఇంటికే లిక్కర్ కావాలంట! మందుబాబుకు హైకోర్టు మొట్టికాయ
Follow us on

దేశమంతా కరోనా భయాందోళనతో వణికిపోతుంటే.. మందు బాబుల అతి తెలివి తేటలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. తమిళనాడులో క్యూ వరుసలో తమదైన తెలివిని ప్రదర్శించిన ఉదంతం మరచిపోకముందే.. కేరళలో ఓ మందు బాబు అతి తెలివి ప్రదర్శించి ఏకంగా హైకోర్టులో చివాట్లు తిని.. ఏకంగా యాభై వేల ఫైన్ వేయించుకున్నాడు. దాంతోపాటు జడ్జి పెట్టిన చీవాట్లతో మనోడికి మైండ్ బ్లాక్ అయ్యింది.

ఒకవైపు కరోనా వైరస్ దేశప్రజల్లో భయాందోళన నింపుతోంది. మరోవైపు సరిపడా నిత్యావసరాలు తెచ్చకుని ఇంటి నుంచి కదలకుండా వైరస్ నుంచి తప్పించుకునేందుకు ప్రజలంతా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మందుబాబులకు కొత్త పరేషాన్ ఎదురైంది. బార్లు మూతపడడంతో వైన్సుల దగ్గర సందడి పెరిగింది. భారీ సంఖ్యలో వైన్సుల దగ్గర క్యూలైన్లు కడుతున్నారు. మందుబాబులు భారీ సంఖ్యలో దర్శనమిస్తున్నారు.

కేరళకు చెందిన ఓ మందు బాబు లిక్కర్ హోం డెలివరీ చేయించుకుంటే బెటరనుకున్నాడు. వైన్సుల దగ్గరికి వెళితే కరోనా తగులుకునే ఛాన్స్ వుందని భావించాడు. ఈ పాయింట్ ఆధారంగా ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు. లిక్కర్‌ను కూడా హోం డెలివరీ చేయించేలా ఆదేశాలివ్వాలంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాడు జ్యోతిష్ అనే మందుబాబు. ఇది కాస్తా జస్టిస్ జయశంకరన్ నంబియార్ బెంచ్ ‌మీదికి వెళ్ళింది. అంతే.. సదరు జడ్జికి ఒళ్ళు మండిపోయింది. దేశమంతా ఎమర్జెన్సీ తరహాలో వాతావరణం నెలకొంటే నీకు లిక్కర్ కావాల్సివచ్చిందా అంటూ పిటిషనర్‌ను చివాట్లేశారు జడ్జి.

జస్టిస్ జయశంకరన్ నంబియార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఖంగుతిన్న పిటిషనర్, అతని న్యాయవాది… పొరపాటైంది బాబోయ్.. పిటిషన్ వెనక్కి తీసుకుంటామని మొత్తుకున్నారు. అయినా కూడా అలార్మింగ్ సమయంలో ఈ ఆటలేంట్రా అంటూ ఏకంగా యాభై వేల రూపాయల ఫైన్ వేసేశారు జస్టిస్ జయశంకరన్ నంబియార్. దాంతో మనోడికి తిక్క కుదిరిందని చెప్పుకుంటున్నారు మందుబాబు జ్యోతిష్ గురించి తెలిసిన వారు.