ఒక్క రూపాయికే క్వార్టర్ మద్యం..అభిమాన దర్శకుడి పెళ్లి రోజు సందర్భంగా
సాధారణంగా రాజకీయ నాయకుల మీద, సినిమా నటుల మీద అభిమానులు తమ ప్రేమను చాటుకోవడానికి విభిన్న మార్గాల్లో ప్రయత్నిస్తూ ఉంటారు.
సాధారణంగా రాజకీయ నాయకుల మీద, సినిమా నటుల మీద అభిమానులు తమ ప్రేమను చాటుకోవడానికి విభిన్న మార్గాల్లో ప్రయత్నిస్తూ ఉంటారు. తాము ఆరాదించే వ్యక్తుల పేరు మీద రక్తదానం చేయడం, అన్నదానం చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. కానీ ఇక్కడో వీరాభిమాని మాత్రం ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు.
ప్రముఖ ఫిలిం డైరెక్టర్ ఎన్ శంకర్ పెళ్లిరోజు సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్.సి సెల్ ఉపాధ్యక్షుడు చింతకుంట విష్ణు తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. శంకర్ పెళ్లిరోజు సందర్భంగా ఒక్క రూపాయికే ఒక్క క్వార్టర్ మద్యంను పంచి పెట్టాడు. జోగులంబా గద్వాల్ జిల్లా అలంపూర్ లో ఎస్.వి వైన్ షాప్ ముందు గంట పాటు ఈమద్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
క్యూలైన్లో టోకెన్లు ఇచ్చి మద్యం పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న మందుబాబులు ఆనందంతో మద్యాన్ని తీసుకున్నారు. గంట సమయం మాత్రమే కేటాయించడంతో 45 మంది ఈ ఒక్క రూపాయికి కార్టర్ మద్యాన్ని అందుకోగలిగారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Also Read :
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ ! హీరోయిన్‌గా ఆమెను ప్రిఫర్ చేస్తున్నారట
గుడ్ న్యూస్..తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 502 మాత్రమే