పాక్ మీద కోపంతో కలెక్టర్ సంచలన నిర్ణయం

| Edited By: Srinu

Mar 07, 2019 | 7:15 PM

బికనీర్: పుల్వామా ఉగ్రదాడిలో మన 40 మంది సీఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న తర్వాత పాకిస్థాన్‌పై దేశంలో వ్యతిరేకత ఎక్కువౌతోంది. కుదిరిన అన్ని రకాలుగా చర్యలకు పూనుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ జిల్లాలో కలెక్టర్ గౌతమ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన వారు 48 గంటల్లో బికనీర్ వదలి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లల్లో, హోటళ్లతో సహా ఏ ప్రదేశంలోనే ఉండటానికి వీల్లేదని వెల్లడించారు. అంతేకాదు పాకిస్థాన్‌తో ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరపకూడదని […]

పాక్ మీద కోపంతో కలెక్టర్ సంచలన నిర్ణయం
Follow us on

బికనీర్: పుల్వామా ఉగ్రదాడిలో మన 40 మంది సీఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న తర్వాత పాకిస్థాన్‌పై దేశంలో వ్యతిరేకత ఎక్కువౌతోంది. కుదిరిన అన్ని రకాలుగా చర్యలకు పూనుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ జిల్లాలో కలెక్టర్ గౌతమ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన వారు 48 గంటల్లో బికనీర్ వదలి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇళ్లల్లో, హోటళ్లతో సహా ఏ ప్రదేశంలోనే ఉండటానికి వీల్లేదని వెల్లడించారు. అంతేకాదు పాకిస్థాన్‌తో ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరపకూడదని ఆదేశించారు. ఈ బికనీర్ ప్రాంతం పాకిస్థాన్‌కు బోర్డర్‌లో ఉంటుంది. దీంతో పాకిస్థానీలు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. వ్యాపారాలు కూడా జరుగుతుంటాయి. దేశ వ్యాప్తంగా పాక్‌పై ఆగ్రహ జ్వాలలు రగులుతున్న నేపథ్యంలో బికనీర్ జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది.

పుల్వామా దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు 23 ఏళ్ల క్రితం ఇచ్చిన అత్యంత అనుకూల దేశం గుర్తింపును ఉపసంహరించుకుంది. అంతే కాకుండా పాకిస్థాన్‌ నుంచి జరిగే దిగుమతులపై సుంకాన్ని 200 శాతం పెంచింది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బాస్ అయిన మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. భారత చలన చిత్ర పరిశ్రమ కూడా తన వంతు బాధ్యతగా పాకిస్థాన్‌కు చెందిన నటీనటులను నిషేధించింది.