షాక్ కొడుతున్న ట‌మాటా ధ‌ర‌లు

ట‌మాటాకు ఎప్పుడూ ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఈ కూర‌గాయ ధ‌ర ఆకాశాన్ని అంటుతుంది. అంత‌లోనే నేల జారుతుంది.

షాక్ కొడుతున్న ట‌మాటా ధ‌ర‌లు

Updated on: Sep 05, 2020 | 3:22 PM

ట‌మాటాకు ఎప్పుడూ ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఈ కూర‌గాయ ధ‌ర ఆకాశాన్ని అంటుతుంది. అంత‌లోనే నేల జారుతుంది. తాజాగా ట‌మాటా ధ‌ర‌లు మండిపోతున్నాయి. మార్కెట్‌లో ప్ర‌స్తుతం కేజీ ట‌మాటా ధ‌ర రూ. 50 నుంచి రూ. 60 వ‌ర‌కు ఉంది. దీంతో సామాన్యులు షాక్‌కు గుర‌వుతున్నారు. కేవలం ట‌మాటా ధ‌ర మాత్ర‌మే కాదు. అన్ని ర‌కాల కూర‌గాయ‌ల ధ‌ర‌లు పెరిగాయి. అయితే ట‌మాటా ఉంటే చాలు..ర‌సం పెట్టుకునైనా ఆ పూట‌కు న‌డిపించొచ్చు అనుకుంటారు మ‌ధ్య‌త‌ర‌గ‌తి జనాలు. ఇప్పుడు వాటిని ముట్టుకుందామంటే ధ‌ర‌లు షాక్ కొట్టేలా ఉన్నాయి.

కాగా ట‌మాటా ధ‌ర‌లు ఇంతలా పెర‌గ‌డానికి ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాలే కార‌ణ‌మ‌ని రైతులు చెబుతున్నారు. వ‌ర్షాల కారంణంగా చాలా ప్రాంతాల్లో పంట పాడైపోయింది. మ‌రికొన్ని చోట్ల పంట పూర్తిగా చేతికి రాలేదు. తెలంగాణ‌లో రంగారెడ్డి, మెద‌క్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ట‌మాట అధికంగా పండుతుంది. ఇక ఇత‌ర రాష్ట్రాల్లో కూడా వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు వ‌ల్ల పంట నాశనం అయింది. సాధార‌ణంగా హైద‌రాబాద్ న‌గ‌రానికి రోజుకు 120నుంచి 150 లారీల టమాటా దిగుమతి అవుతుంది. కానీ ప్రస్తుతం 50 నుంచి 60 లారీలు కూడా రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.

 

Also Read :

చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో క‌రోనా టెర్ర‌ర్..కేంద్రం కీల‌క ఆదేశాలు

అడ్మిషన్‌ రద్దు చేసుకుంటే విద్యా సంస్థ‌లు ఫీజు వెనక్కి ఇవ్వాల్సిందే

దర్గాలో వింత : సమాధిలో కదలికలు