కేరళలో రెడ్ అలర్ట్.. 52కు చేరిన మృతుల సంఖ్య

కేరళలో రెడ్ అలర్ట్.. 52కు చేరిన మృతుల సంఖ్య

ఆరు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆదివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం నుంచి వర్షపాతం తగ్గే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇడుక్కి జిల్లాలో మున్నారు సంభవించిన భారీ వర్షాలకు కొండచరియలు..

Sanjay Kasula

|

Aug 11, 2020 | 1:51 PM

Death toll in Munnar Landslide Rises : గత నాలుగు రోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని కేరళలోని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఆరు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆదివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం నుంచి వర్షపాతం తగ్గే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇడుక్కి జిల్లాలో మున్నారు సంభవించిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో.. 52 మంది మృతి చెందారు, 20 మంది ఆచూకి ఇంత వరకు లభించలేదు. చనిపోయినవారిలో చాలా మంది తమిళనాడుకు చెందినవారిగా అధికారులు గుర్తించారు.

కామరాగోడ్, కన్నూర్, వయనాడ్, కోజికోడ్, మలప్పురం మరియు అలప్పుజ జిల్లాల్లో IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలప్పుజకు ఉత్తరాన ఉన్న అన్ని జిల్లాల్లో 20 సెం.మీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అధికారులు తెలిపారు. ఇదిలావుండగా, కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ముల్లపెరియార్ రిజర్వాయర్ వద్ద నీటి మట్టం ఆదివారం అర్థరాత్రి 136 అడుగులకు చేరుకుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu