విరిగిపడ్డ కొండ చరియలు.. నిలిచిపోయిన గూడ్స్ రైళ్లు…

|

Jun 06, 2020 | 1:17 PM

విశాఖపట్నంలోని చిమిడిపల్లి బొర్రా గుహల రైల్వేస్టేషన్ సమీపంలో భారీగా కొండ చరియలు జారిపడ్డాయి. దీనితో కేకే లైన్‌లో వెళ్లే గూడ్స్ రైళ్లకు అంతరాయం ఏర్పడింది.

విరిగిపడ్డ కొండ చరియలు.. నిలిచిపోయిన గూడ్స్ రైళ్లు...
Follow us on

విశాఖపట్నంలోని చిమిడిపల్లి బొర్రా గుహల రైల్వేస్టేషన్ సమీపంలో భారీగా కొండ చరియలు జారిపడ్డాయి. దీనితో కేకే లైన్‌లో వెళ్లే గూడ్స్ రైళ్లకు అంతరాయం ఏర్పడింది. మళ్లీ ట్రాక్‌ను పునరుద్ధరించడానికి రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా ఇదే ప్రదేశంలో వెనువెంటనే కొండ చరియలు జారిపడి నలుగురు మృతి చెందిన విషయం విదితమే. దీనితో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు రైల్వేశాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.

రైల్వే ఉన్నతాధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. కేకే లైన్‌లో ప్రతీరోజూ 14 గూడ్స్ ట్రైన్స్ ఈ ట్రాక్‌పై తిరుగుతుంటాయి. కొండచరియలు జారి పడకుండా రైల్వేశాఖ తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తరచుగా ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కేకే లైన్ వల్ల విశాఖ రైల్వే జోన్‌కు భారీగా ఆదాయం చేకూరుతున్నప్పటికీ ఇటువంటి సంఘటనల వల్ల ఆదాయానికి గండి పడుతోంది. కాగా, ప్రస్తుతం ఆ లైన్లో డబ్లింగ్ పనులు జరుగుతున్న నేపధ్యంలో అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Also Read:

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

ఏపీలో మరిన్ని సడలింపులు.. ఆలయాలు, హోటల్స్, మాల్స్‌కు నయా రూల్స్…

కిమ్ ఆస్తుల ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, బెంగళూరుకు బస్సులు.. కానీ!

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

కులాంతర వివాహాలు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండిలా..