అక్కడ.. ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు లేదట..

| Edited By:

May 25, 2020 | 4:43 PM

Lakshadweep: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే భారత్ లోని కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో మాత్రం ఇప్పటివరకు దాని జాడే లేకపోవడం విశేషం. 36 ద్వీపాలతో కూడిన అందమైన ద్వీపసమూహంగా అలరారుతున్న లక్షద్వీప్‌లో దాదాపు 64 వేల జనాభా ఉన్నది. కేరళ తీరం వెంబడి ఉన్న ఈ కేంద్రపాలిత ప్రాంతం.. దాని అవసరాల కోసం దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడి ఉంటుంది. కాగా.. పచ్చని […]

అక్కడ.. ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు లేదట..
Follow us on

Lakshadweep: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే భారత్ లోని కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో మాత్రం ఇప్పటివరకు దాని జాడే లేకపోవడం విశేషం. 36 ద్వీపాలతో కూడిన అందమైన ద్వీపసమూహంగా అలరారుతున్న లక్షద్వీప్‌లో దాదాపు 64 వేల జనాభా ఉన్నది. కేరళ తీరం వెంబడి ఉన్న ఈ కేంద్రపాలిత ప్రాంతం.. దాని అవసరాల కోసం దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడి ఉంటుంది.

కాగా.. పచ్చని చెట్లు, చుట్టూ సముద్రంతో కనువించు చేసే ఈ ద్వీపకల్పంలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. నిన్నటివరకు జీరో కేసులుగా ఉన్న నాగాలాండ్‌లో చెన్నై నుంచి శ్రామిక్‌ రైళ్లో వచ్చిన వలస కార్మికులు ముగ్గురిలో పాజిటివ్‌ బయటపడింది. సిక్కింలో కూడా శనివారమే తొలి కేసు నమోదైనట్లు సమాచారం. ఇక్కడ పాజిటివ్‌గా తేలిన వ్యక్తి ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన 25 ఏళ్ల విద్యార్థిగా గుర్తించారు. ఈయనతో కలిసిన 17 మందికి పరీక్షలు జరుపగా అందరికీ నెగెటివ్‌గా నివేదికలు వచ్చాయి.