కేంద్రంపై కేటీఆర్ ధ్వజం
కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు తెలంగాణ మునిసిపల్ మంత్రి కే.తారక రామారావు. రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
KTR blames Central Government: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు తెలంగాణ మునిసిపల్ మంత్రి కే.తారక రామారావు. రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. కేంద్రానికి తెలంగాణ నుంచి పోయే పన్నుల్లో సగం మాత్రమే రాష్ట్రానికి తిరిగి వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, మరోవైపు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న నిధులకు సంబంధించి పలు అంశాలపైన మంత్రి కే. తారకరామారావు ఆదివారం తన ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేశారు.
The people of Telangana should know that since 2014, our state’s contribution to Centre in the form of taxes is a whopping ₹2,72,926 Cr whereas what Centre has released to Telangana is ₹1,40,329 Cr!
Telangana continues to be a pillar of strength for India ?#TelanganaEconomy pic.twitter.com/07UANGDQe3
— KTR (@KTRTRS) November 1, 2020
తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో సగం మాత్రమే తెలంగాణకు తిరిగి వస్తున్నాయని ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల 75 వేల 926 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం టాక్సుల రూపంలో తెలంగాణ నుంచి తీసుకుందని, అదే సమయంలో కేవలం లక్షా 40 వేల 329 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చిందని మంత్రి కేటీఆర్ వివరించారు.
The growth in GSDP & Per capita income were achieved with investments in key infra sectors & increased capital expenditure
At the same time fiscal prudence was balanced
On Debt-GSDP ratio, Telangana with 22.8 is in the top-5 states with low Debt – GSDP ratio#TelanganaEconomy pic.twitter.com/FjTywbHUSx
— KTR (@KTRTRS) November 1, 2020
తెలంగాణ రాష్ట్ర జీ.ఎస్.డీ.పీ.,తలసరి ఆదాయం సైతం భారీగా పెరిగిందని, ముఖ్యంగా కీలకమైన రంగాల్లో పెట్టుబడులతో పాటు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేసిన మూలధన వ్యయం ఫలితంగానే ఇది సాధ్యమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించి అప్పులు, జీఎస్‌డీపీ రేషియో 22.8 శాతంగా ఉన్నదన్నారు. దేశంలో రుణాలు, జీఎస్‌డీపీ రేషియో తక్కువ కలిగిన ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సమ్మిళితమైనదని, ముఖ్యంగా వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్ వంటి అన్ని రంగాల్లోనూ వృద్ధి కొనసాగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2014- 2020 మధ్యలో భారతదేశ తలసరి ఆదాయం 54.9 శాతంగా ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం భారీగా పెరిగి 83.9 శాతంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు.