
Andhra Pradesh: ఆమెకు కట్టుకున్న భర్త లేడు.. కడుపున పుట్టిన పిల్లలు కూడా లేరు.. ఆమె యోగక్షేమాలు చూసుకునే నాధుడే లేడు.. ఆ తల్లికి పిల్లల్ని ఎత్తుకుని ఆడి పాడి లాలించాలనే కోరిక నెరవేరలేదు.. అయితే పిల్లలు లేని ఆ తల్లికి కుక్కలు, పిల్లి పిల్లలే ఆమె పిల్లలు అయ్యాయి. కుక్కల్ని, పిల్లులను ఆమె పిల్లలుగా పెంచుకుంటూ విశ్వాసం లేని మనుషుల కన్నా విశ్వాసం చూపిస్తున్న మూగ జీవాల కోసం జీవిస్తున్న 70 ఏళ్ల ఓ వృద్ధురాలి కథ..
అంబెడ్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం రాజులపాలెం గ్రామం నికి చెందిన ఇందిరమ్మ కుక్కల్ని, పిల్లులను తన పిల్లలుగా పెంచుతూ జివిస్తుంది. పెళ్ళి అయిన తరువాత పిల్లలు పుట్టి వెంటనే చనిపోవడం తరువాత కొన్నాళ్ళకు భర్త కూడా అనారోగ్యంతో చనిపోయాడు దీనితో తనకు పిల్లలు లేకపోవడంతో కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకుంటూ వాటి ఆలనా పాలన చూసుకుంటూ జివిస్తుంది. తనతో పాటే ఇంట్లో రెండు కుక్కలు, రెండు పిల్లుల్ని పెంచుతూ వాటినే తన పిల్లలుగా చేసుకుంటుంది ఇందిరమ్మ. తన కోసం వండుకునే భోజనంలో వాటికి కూడా కాసింత తీసి పెడుతుంది. ఇందిరమ్మ చూపిస్తున్న ప్రేమకు కుక్కలు, పిల్లులు ఆమెను వదిలి ఎక్కడికి వెళ్లకుండా అమెతోనే ఆమే మంచం వద్దే కాపలాగా ఉంటున్నాయి.
పిల్లి పిల్లలను తన పక్కనే మంచం మీద పడుకుంటే.. కుక్కలు మంచం వద్దే పడకుంటాయి. తాను ఎక్కడికైనా ఊరు వెళితే తిరిగి వచ్చే వరకు వాటిని చుసుకునేందుకు పొరుగింటి వారికి చెప్పి వెళ్లానని చెబుతోంది ఇందిరమ్మ. ఇవి చూపిస్తున్న ప్రేమ చుట్టుపక్కల ఉన్న మనుషులు ఎవ్వరు చూపించరని, మనుషులకు స్వార్థం ఉంటే వీటికి విశ్వాసం ఉందని చెబుతోంది. ఇంతటి ప్రేమ చూపిస్తున్న కుక్కలు, పిల్లులే నా పిల్లలు అని వీటితో కొన్ని సంవత్సరాలుగా జీవిస్తున్నానని ఇందిరమ్మ అంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..