కానిస్టేబుల్ బానేష్ ఆచూకీ లభ్యం..ఫ్లాట్‌ఫాంపై దుర్భరస్థితిలో, ఏ దిక్కులేనివాడిలాగా

| Edited By: Pardhasaradhi Peri

Nov 22, 2020 | 10:03 AM

అతనో కానిస్టేబుల్‌. కనిపించకుండా పోయి 25 రోజులు అయింది. ఏమైపోయాడు.. ఎక్కడికెళ్లాడని విచారణ జరుగుతున్న క్రమంలో..

కానిస్టేబుల్ బానేష్ ఆచూకీ లభ్యం..ఫ్లాట్‌ఫాంపై దుర్భరస్థితిలో, ఏ దిక్కులేనివాడిలాగా
Follow us on

అతనో కానిస్టేబుల్‌. కనిపించకుండా పోయి 25 రోజులు అయింది. ఏమైపోయాడు.. ఎక్కడికెళ్లాడని విచారణ జరుగుతున్న క్రమంలో.. ఫ్లాట్‌ఫాంపై దుర్భరస్థితిలో కనిపించాడు. పెళ్లై, ఫ్యామిలీ ఉన్నా.. సమస్యల సుడిగుండంలో అన్నీ వదులుకుని బతుకుబాటసారిలా మారాడు. దర్జాగా పోలీస్ యూనిఫామ్‌లో డ్యూటీ ఉండాల్సిన బానేష్…కాజిపేట రైల్వేస్టేషన్‌ ఫుట్‌పాత్‌పై ఏ దిక్కులేనివాడిలాగా కనిపించాడు. చింపిరి గడ్డం, మాసిపోయిన దుస్తులతో ఉన్న బానేష్‌ని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.

కొమురంభీం జిల్లా పెంచికల్‌పేట పీఎస్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న భానేష్‌.. గత నెల 28 నుంచి కనిపించకుండా పోయాడు. సిర్పూర్‌ టి చెక్‌పోస్టు దగ్గర చివరిసారిగా డ్యూటీ చేశాడు. ఆ తర్వాత భానేష్‌ జాడ లేకుండా పోవడంతో.. అతని భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి గాలిస్తున్నా.. ఎలాంటి సమాచారం దొరకలేదు. ఓసారి స్వయంగా అతనే స్థానిక ఎస్‌ఐకి ఫోన్‌ చేసి.. తాను క్షేమంగానే ఉన్నానని, కుటుంబకలహాలు, ఆర్ధిక ఇబ్బందులతోనే విధులకు హాజరుకాలేకపోతున్నానని చెప్పాడు. సమాచారం ఇచ్చినప్పటికీ.. ఎక్కడున్నాడన్నది తెలియకుండా పోవడంతో దర్యాప్తు జరుపుతుండగా ఆకస్మాత్తుగా ఖాజీపేటలో కనిపించాడు.

అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎటు వెళ్లాలో తెలియక ఇలా పుట్ పాత్ పై కాలం గడిపానని బానేష్ తెలిపాడు. అతన్ని అదుపులోకి తీసుకుని.. కుటుంబసభ్యులకు అప్పగించారు. కానిస్టేబుల్‌గా మంచి లైఫ్‌ను లీడ్‌ చేయాల్సిన బానేష్‌ బతుకు.. ఇలా ఫుట్‌పాత్‌ అవడం అందరినీ కలిచివేసింది.

Also Raed :

జీహెచ్‌ఎంసీ పోలింగ్‌..డిసెంబర్ 1న సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం

చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు, కానిస్టేబుల్​ అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్