AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమలలో రేపు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఏడాదిలో నాలుగుసార్లు.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠం ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారాల్లో తిరుమంజనంలో భాగంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించటం సంప్రదాయం...

తిరుమలలో రేపు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
Sanjay Kasula
|

Updated on: Sep 14, 2020 | 7:48 PM

Share

తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి మొదలు కాబోతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఏడాదిలో నాలుగుసార్లు.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠం ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారాల్లో తిరుమంజనంలో భాగంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించటం సంప్రదాయం.

ఈ నెల 19 నుంచి 27 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 16 నుంచి 24వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమం చేపట్టనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుధ్ధి కార్యక్రమాలు చేపడుతారు. అనంతరం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగుతుంది.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. కొవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు.

Follow Us
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!
ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!
ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత
ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత