Chandramukhi: చంద్రముఖి సినిమాలోని ప్యాలెస్ ఒక్కరోజు అద్దె ఎంతో తెలిస్తే ఫ్యూజుల్ అవుట్..
సాధారణంగా పెద్ద పెద్ద ప్యాలెస్ కనిపిస్తే అందులో ఎక్కువగా సినిమా షూటింగ్స్ చేస్తారు. ఇక శిథిలావస్థలో ఉన్న బంగ్లాలో ఎక్కువగా హారర్ మూవీస్త తెరకెక్కిస్తుంటారు. ప్యాలెస్ గురించి ఇప్పటికే అనేక చారిత్రక గాథలు వినే ఉంటారు. అలాంటి రాజభవానాల్లో ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్స్, హారర్ మూవీస్ రూపొందిస్తారు.
తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో రాజభవనాల్లో ఎక్కువగా హారర్ మూవీ షూటింగ్ చేస్తుంటారు. అలాగే కొన్ని భవనాలు సినిమాల ద్వారా మరింత పాపులర్ అవుతుంటారు. అరుంధతి సినిమా ద్వారా గద్వాల్ ప్యాలెస్ ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాలోని రాజమహల్ కూడా అంతే పాపులర్ అయ్యింది. 2005లో విడుదలైన ఈ సినిమాకు పి వాసు దర్శకత్వం వహించారు. ఇందులో రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార, వడివేలు, విజయకుమార్, నాసర్, మాళవిక, కెఆర్ విజయ్, వినీత్ కీలకపాత్రలు పోషించారు. దర్శకుడు వాసు కామెడీతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ కథను అందించారు. 190 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన చంద్రముఖి ప్రపంచ వ్యాప్తంగా 900 కోట్లకు పైగా వసూలు చేసింది.
రామ్‌కుమార్ గణేశన్ ప్రభు తన సంస్థ శివాజీ గణేశన్ ప్రొడక్షన్స్ ద్వారా నిర్మించిన ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అలాగే 890 రోజుల కలెక్షన్ల వేటలో రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి విద్యా సాగర్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. ఈ సినిమాలో కనిపించిన ప్యాలెస్ కర్ణాటకలో ఉన్నట్లు సమాచారం. మైసూర్ ప్యాలెస్ కర్ణాటకలో చాలా ప్రసిద్ధి చెందింది. బెంగళూరు ప్యాలెస్ అక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ బెంగళూరు ప్యాలెస్ చంద్రముఖి రాజభవనం.
ఈ బెంగుళూరు ప్యాలెస్‌లో అనేక గదులను అద్దెకు తీసుకుని చంద్రముఖి షూటింగ్ జరిగింది. ఒక్కరోజు షూటింగ్ కి అద్దె రూ.1.5 లక్షలు. ఇందులో ఫిల్మ్ రూమ్స్ కోసం సెట్స్ వేశారు. చంద్రముఖి గది అలాంటి సెట్. ఈ ప్యాలెస్‌కి వచ్చే అధికారులు విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక ఇల్లు ఉంది. సినిమాలో వినీత్ ఉంటూ డాన్స్ నేర్పించే ఇల్లు అది. ఈ ప్యాలెస్‌ని సందర్శించేందుకు భారతీయులకు రూ.225, విదేశీ పర్యాటకులకు రూ.450 చెల్లించాలి. ఈ ప్యాలెస్ షూటింగ్‌లకే కాదు పెళ్లిళ్లకు కూడా అద్దెకు ఇస్తారు. ఈ ప్యాలెస్ దాదాపు 120 సంవత్సరాల నాటిది.