జగన్ స్వింగ్‌లోనూ వాళ్లే కింగ్స్..ఎర్రన్నాయుడు చలవే అంటారా?

|

May 24, 2019 | 4:40 PM

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. అధికార టీడీపీని మట్టికరిపిస్తూ ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుంది.  ఏకంగా 151 స్థానాల్లో గెలుపొంది తెలుగు పొలిటికల్ స్రీన్‌పై చెరిగిపోని రికార్డును నెలకొల్పింది. జగన్ దెబ్బకు టీడీపీ 23 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే స్టేట్ వైడ్ టీడీపీ ఇంత పతనమైనా..కింజరపు ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు మాత్రం విజయం సాధించారు. దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు తమ్ముడు అచ్చెన్నాయుడు, కుమారుడు రామ్మోహన్‌ […]

జగన్ స్వింగ్‌లోనూ వాళ్లే కింగ్స్..ఎర్రన్నాయుడు చలవే అంటారా?
Follow us on

ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. అధికార టీడీపీని మట్టికరిపిస్తూ ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుంది.  ఏకంగా 151 స్థానాల్లో గెలుపొంది తెలుగు పొలిటికల్ స్రీన్‌పై చెరిగిపోని రికార్డును నెలకొల్పింది. జగన్ దెబ్బకు టీడీపీ 23 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే స్టేట్ వైడ్ టీడీపీ ఇంత పతనమైనా..కింజరపు ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు మాత్రం విజయం సాధించారు. దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు తమ్ముడు అచ్చెన్నాయుడు, కుమారుడు రామ్మోహన్‌ నాయుడు, కుమార్తె భవానీ ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయకేతనం ఎగరేశారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అచ్చెన్నాయుడు రెండోసారి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌పై 8,857 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. ఇక ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్‌ నాయుడు సైతం శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై 6,653 ఓట్ల మెజారిటీతో రామ్మోహన్‌ గెలుపొందారు. మరోవైపు రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎర్రన్నాయుడి కుమార్తె, సీనియర్‌ నేత ఆదిరెడ్డి అప్పారావు కోడలు భవానీ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావుపై 30,065 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడటం విశేషం. ఇంత  జగన్ స్వింగ్‌లోనూ ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన ముగ్గురు టీడీపీ అభ్యర్థులు గెలవడం దివంగత నేత ఎర్రన్నాయడు చలవే అంటున్నారు ఆయన అభిమానులు.