King Cobra : గోదావరి నదీ తీరాన ఉన్న కాళేశ్వరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కాళేశ్వరంలోని 108 శివలింగాల ఆలయంలో కనిపించిన అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని అష్టోత్తర శత శివలింగ సహిత ద్వాదశ జ్యోతీర్లింగ క్షేత్రమం నిర్మల గౌతమాశ్రమం గర్భగుడిలోని 108 శివలింగాల మధ్యలో నాగుపాము ప్రత్యక్షమైంది. నాగుపాము గర్భగుడిలోనే తిష్ట వేయడంతో భక్తులు,స్థానికులు బారులు తీరారు. ఇదంతా ఆ శివ మహాత్యంగా భావించారు. కానీ, శివ లింగాల మాటున నక్కిన నాగుపామును చూసి భక్తులు ఒకింత భయాందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉంటే, గతంలో ఖమ్మం జిల్లా కూసుమంచిలోని కాకతీయుల కాలం నాటి శివాలయం లో కూడా ఓ నాగుపాము ప్రత్యక్షమైంది. సోమవారం శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం కావడంతో తెల్లవారుజామునే ఆలయ పూజారి శేషగిరి శర్మ శివుడికి పూజలు చేసేందుకు గుడి తలుపులు తీశారు. అప్పటివరకు శివలింగం పైన ఉన్న నాగుపాము కిందకు దిగి శివలింగం పక్కనే పడగ విప్పి ఉండటంతో అక్కడకు వచ్చిన భక్తులు అంతా శివుని మహిమే అంటూ నాగుపాముకు దండం పెట్టుకుని పూజలు చేశారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి