సోషల్ మీడియాలో రికార్డ్ క్రియేట్ చేసిన కింగ్ నాగార్జున

| Edited By: Pardhasaradhi Peri

Jun 17, 2020 | 5:02 PM

టాలీవుడ్‌లో మిస్టర్ కూల్ పర్సన్ ఎవరంటే.. కింగ్ అక్కినేని నాగార్జునే గుర్తొస్తారు. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ.. నవ్విస్తూ ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టీవ్‌గా ఉంటారు నాగార్జున. తన అభిప్రాయాలను, సినిమా విశేషాలను ఫ్యాన్స్, ఫాలోవర్స్‌‌తో ఎప్పటికప్పుడు...

సోషల్ మీడియాలో రికార్డ్ క్రియేట్ చేసిన కింగ్ నాగార్జున
Follow us on

టాలీవుడ్‌లో మిస్టర్ కూల్ పర్సన్ ఎవరంటే.. కింగ్ అక్కినేని నాగార్జునే గుర్తొస్తారు. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ.. నవ్విస్తూ ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టీవ్‌గా ఉంటారు నాగార్జున. తన అభిప్రాయాలను, సినిమా విశేషాలను ఫ్యాన్స్, ఫాలోవర్స్‌‌తో ఎప్పటికప్పుడు పంచుకుంటూంటారు. కాగా నాగార్జున ఇప్పుడు సోషల్ మీడియాలో మరో రికార్డు అందుకున్నారు. ప్రముఖ సోషల్ మీడియా అకౌంట్ అయిన ట్విట్టర్‌లో 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా రికార్డులకు ఎక్కాడు. ఈ సందర్భంగా నాగార్జున తన ట్విట్టర్ ఫ్యామిలీకి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున.. తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు సాధించుకున్నారు. కాగా ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్ డాడ్’ అనే సినిమాతో పాటు ‘బ్రహ్మాస్త్ర’లో కూడా నటిస్తున్నారు. వీటితో పాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్టు సమాచారం.

Read More: 

హీరో సుశాంత్ సూసైడ్: బాలీవుడ్ ప్రముఖులపై కేసులు నమోదు

మళ్లీ లాక్‌డౌన్.. వైన్ షాపులకి పరుగులు పెడుతోన్న మందు బాబులు..

బిగ్ బ్రేకింగ్: కరోనాతో ముఖ్యమంత్రి పీఏ మృతి..

బ్రేకింగ్: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..