మోటార్ సైకిల్ మెకానిక్ గా మారిన అసిస్టెంట్ ప్రొఫెసర్

లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన ఉద్యోగులు పూట గడవడం కోసం రకరాల పనుల్లో నిమగ్నమయ్యారు. తాజాగా ఓ అసిస్టెంట్ ప్రోఫెసర్ నా కుటుంబపోషణకు మోటార్ సైకిల్ రిపేర్లు చేస్తూ కాలం వెల్లదీస్తున్నాడు.

మోటార్ సైకిల్ మెకానిక్ గా మారిన అసిస్టెంట్ ప్రొఫెసర్
Follow us

|

Updated on: Jun 28, 2020 | 3:09 PM

దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలానికి జనం అల్లాడిపోతున్నారు. ఉపాధి కోల్పోయిన ఉద్యోగులు పూట గడవడం కోసం రకరాల పనుల్లో నిమగ్నమయ్యారు. తాజాగా ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ నా కుటుంబపోషణకు మోటార్ సైకిల్ రిపేర్లు చేస్తూ కాలం వెల్లదీస్తున్నాడు.

ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలోని బంజారాకాలనీకి చెందిన వి.రవీందర్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేశాడు. హైదరాబాద్, ఖమ్మంలలో పదేళ్లుగా వివిధ ప్రైవేట్ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కరోనా ప్రభావంతో రవీందర్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. లాక్ డౌన్ తో కళాశాలలు మూతపడడంతో జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ఆయన భార్య కూడా ఎంటెక్ పూర్తి చేసింది. అయినప్పటికీ వారికి ఉద్యోగం దొరకపోవడంతో కుటుంబపోషణ భారంగా మారింది. పూట గడవడం కష్టంగా మారడంతో ఇద్దరు పాపలతో కలిసి సొంతూరుకు చేరాడు. మరోవైపు ఇల్లు గడవటం కష్టమవడంతో తనకు వచ్చిన మోటారు సైకిల్‌ మెకానిక్‌ వృత్తి ఎంచుకున్నాడు. మధిరలో మెకానిక్ షాపు తెరుచుకుని టూవీలర్స్ మెకానిక్ గా కొత్త అవతారం ఎత్తాడు. ఫ్యామిటీ గడవాలంటే ఎదో ఒక పని చేయకతప్పదంటూ సింపుల్ గా కొట్టిపారేస్తున్నాడు రవీందర్.