‘జబర్దస్త్’ కామెడీ షో ఎంతో మందికి జీవితాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టిస్టులు నుంచి టెక్నిషియన్లు సహా వందల మంది ఈ షో ద్వారా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తెలుగు తెరపై ప్రస్తుతం కామెడీ పంచుతోన్న చాలామంది కమెడియన్లు కూడా ఈ షో ద్వారానే జనాలకు పరిచయమయ్యాడు. కాగా ఈ షోలో పనిచేసే కమెడియన్ కెవ్వు కార్తిక్ తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై కిడ్నాప్, దాడి కేసు నమోదయినట్లు వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. వివాదాలకు దూరంగా ఉంటూ సౌమ్యుడిగా పేరుండే అతడిపై ఈ తరహా కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.
భూపతిపేటలో ఉండే తన సోదరి భర్తపై కొందరు వ్యక్తులతో కలిసి కార్తిక్ దాడి చేసినట్టుగా పోలీసులకు రవి యాదవ్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశాడు. కార్తీక్ వెంట ఐదుగురు ప్రైవేటు వ్యక్తులు వచ్చి తనను కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనకు కార్తీక్ ఒక్కడే కాదు.. ఆయన పేరెంట్స్ కూడా కారణమే అని కంప్లైంట్ చేసాడు. అందుకే వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కెవ్వు కార్తిక్ స్పందించాడు. తనపై అన్ని తప్పుడు అభియోగాలు మోపారని, విచారణలో వాస్తవాలు తెలుస్తాయన్నారు. 18 సంవత్సరాలుగా తన బావ కుటుంబాన్ని వేధిస్తున్నాడని, నలుగురిలో తనను చులకన చెయ్యడానికే ఫేక్ కేసు పెట్టాడని తెలిపాడు. క్యాన్సర్ బారిన పడిన తన తల్లిని కూడా పోలీసు కేసులో ఏ2 కింద పేర్కొనడం పట్ల కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read :
విమానయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన, 2021 జనవరి 31లోపు ఆ ప్రయాణికులందరికీ రీఫండ్
అయ్యప్ప స్వామి దర్శనం కావాలంటే కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉండాల్సిందే, ఒకవేళ లేకపోతే