యాక్టర్ శ్రీనివాసన్‌పై.. మహిళా కమిషన్ దర్యాప్తు..

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయలో ఇండో-చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కేరళలో అంగన్వాడీ టీచర్లపై అమర్యాదకరమైన వ్యాఖ్యలు

యాక్టర్ శ్రీనివాసన్‌పై.. మహిళా కమిషన్ దర్యాప్తు..

Edited By:

Updated on: Jun 19, 2020 | 9:29 PM

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయలో ఇండో-చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కేరళలో అంగన్‌వాడి టీచర్లపై అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టర్, స్క్రీన్‌రైటర్ శ్రీనివాసన్‌పై రాష్ట్ర మహిళా కమిషన్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. అంగన్వాడీ టీచర్ల సంఘం దాఖలు చేసిన ఫిర్యాదుపై మహిళా కమిషన్ శుక్రవారం ఈ చర్యలు చేపట్టింది. శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆయనను కోరే అవకాశం ఉంది.

కాగా.. మహిళా కమిషన్ సభ్యురాలు షాహిదా కమల్ మాట్లాడుతూ, శ్రీనివాసన్ అంగన్‌వాడి టీచర్లపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలు కేవలం టీచర్లను మాత్రమే కాకుండా పిల్లలను, సమాజాన్ని అవమానించే విధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే.. కేరళలో ప్రాథమిక విద్య నాణ్యతను ఇతర దేశాల్లోని ప్రాథమిక విద్య నాణ్యతతో పోల్చారు శ్రీనివాసన్. ఫిన్లాండ్‌లో ఓ స్థాయికి వచ్చే వరకు బాలలకు పరీక్షలు ఉండవని చెప్పారు.అంగన్‌వాడీల్లో ఉద్యోగం, చదువు లేనివారిని టీచర్లుగా నియమిస్తున్నారన్నారు. పిల్లలు అలాంటివారి మధ్య ఎదుగుతున్నారని, వారి ప్రమాణాల ప్రకారం పెరుగుతున్నారని తెలిపారు.