అపార్ట్‌మెంట్‌లో ఆరు మృతదేహాలు.. పిల్లలకు ఉరేసి..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. విహారానికి అని చెప్పి వెళ్లిన ఆరుగురు కుటుంబ సభ్యులు అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకొని విగత జీవులుగా మారారు.

అపార్ట్‌మెంట్‌లో ఆరు మృతదేహాలు.. పిల్లలకు ఉరేసి..
Follow us

| Edited By:

Updated on: Jun 19, 2020 | 6:55 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. విహారానికి అని చెప్పి వెళ్లిన ఆరుగురు కుటుంబ సభ్యులు అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకొని విగత జీవులుగా మారారు. అందులో ఇద్దరు అన్నదమ్ములు, వారి నలుగురు పిల్లలు ఉన్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌కి చెందిన అమ్రిష్ పటేల్(42), గౌరంక్ పటేల్(40) అనే ఇద్దరు అన్నదమ్ములు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పిల్లలను తీసుకొని విహారానికి వెళ్తున్నామని ఈ నెల 17న ఇంట్లో భార్యలకు చెప్పి వారు బయటకు వెళ్లారు. అయితే 18వ తేది రాత్రి అయినా వారందరూ ఇంటికి రాకపోవడంతో.. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు వారికి చెందిన మరో అపార్ట్‌మెంట్‌కి వెళ్లి చూశారు. అక్కడ లోపల గడియ పెట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకొని అక్కడకు వచ్చిన పోలీసులు లోపలికి వెళ్లగా..  ఆ ఆరుగురు విగత జీవులుగా కనిపించారు. ప్రాథమిక వివరాల ప్రకారం అన్నదమ్ములిద్దరు ఆహారంలో మత్తు కలిపి పిల్లలకు తినిపించి ఉరి వేసి ఆ తరువాత వారిద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారని  అనుమానిస్తున్నారు. మృతదేహాలను ఫోరెన్సిక్ పరీక్షలకు తరలించి, విచారణ జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

Read This Story Also: నువ్వు నిజంగా ఓ ప్రత్యేకమైన వ్యక్తివి: సుశాంత్‌కి శ్రద్ధా అక్షర నివాళి

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..