శ్రీదేవిని చంపేశారా..?

అందాల తార శ్రీదేవి మరణంపై మళ్లీ సందేహాలు మొదలయ్యాయి . ఆమెది సహజమరణం కాదంటూ కేరళ జైళ్ల శాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్ సరికొత్త అనుమానాలకు తెరలేపారు. కేరళ కౌముది పత్రికలో ఆయన శ్రీదేవి మరణంపై ఒక వ్యాసం రాసారు. దీనిలో ఆయన పలు రకాల సందేహాలను వ్యక్తం చేశారు. శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లోని ఓ హోటల్లో ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో మునిగి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపైనే రిషిరాజ్ సింగ్ […]

శ్రీదేవిని చంపేశారా..?
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 12, 2019 | 8:32 PM

అందాల తార శ్రీదేవి మరణంపై మళ్లీ సందేహాలు మొదలయ్యాయి . ఆమెది సహజమరణం కాదంటూ కేరళ జైళ్ల శాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్ సరికొత్త అనుమానాలకు తెరలేపారు. కేరళ కౌముది పత్రికలో ఆయన శ్రీదేవి మరణంపై ఒక వ్యాసం రాసారు. దీనిలో ఆయన పలు రకాల సందేహాలను వ్యక్తం చేశారు. శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లోని ఓ హోటల్లో ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో మునిగి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపైనే రిషిరాజ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ప్రమాదవశాత్తూ బాత్ టబ్‌లో పడిపోయి ఉండకపోవచ్చనే అభిప్రాయపడ్డారు. అయితే తన ఫ్రెండ్.. ఫోరెన్సిక్ నిపుణుడైన ఉమదతన్‌తో ఇదే విషయాన్ని చర్చించినప్పుడు ఆయనకూడా తన అభిప్రాయంతోనే ఏకీభవించారని సింగ్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయంలో మాట్లాడేందుకు తన మిత్రుడు జీవించిలేరని కూడా తెలిపారు. అయితే అతిలోక సుందరి మరణంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలున్నాయి. అయితే పోస్ట్‌మార్టమ్ నివేదిక మాత్రం ఆమెది సహజమరణమేనని తేల్చింది. తాజాగా రిషిరాజ్ సింగ్ లేవనెత్తిన అనుమానాలతో మరోసారి శ్రీదేవి మరణంపై సందేహాలు నెలకొనే పరిస్థితి వచ్చింది.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??