పాత చట్టాలకు మెరుగులు..కేసీఆర్ పిలుపు

|

Jul 07, 2019 | 11:27 AM

పారదర్శకమైన, మెరుగైన అడ్మినిస్ట్రేషన్ ను మనం తీర్చిదిద్దుకోవలసిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మారుతున్న కాలానుగుణంగా పాత చట్టాలను మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవలసి ఉంది. ఇలాంటి చర్యల వల్ల పాలనలో నాణ్యమైన మార్పులు వస్తాయి. తద్వారా ప్రజలకు ఇంకా త్వరగా సేవలు అందించగలుగుతాం అని ఆయన చెప్పారు. ప్రతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన.. కొత్త మున్సిపల్ చట్ట ముసాయిదా రూపకల్పన, నూతన సెక్రటేరియట్ భవన నిర్మాణం వంటి అంశాలపై […]

పాత చట్టాలకు మెరుగులు..కేసీఆర్ పిలుపు
Follow us on

పారదర్శకమైన, మెరుగైన అడ్మినిస్ట్రేషన్ ను మనం తీర్చిదిద్దుకోవలసిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మారుతున్న కాలానుగుణంగా పాత చట్టాలను మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవలసి ఉంది. ఇలాంటి చర్యల వల్ల పాలనలో నాణ్యమైన మార్పులు వస్తాయి. తద్వారా ప్రజలకు ఇంకా త్వరగా సేవలు అందించగలుగుతాం అని ఆయన చెప్పారు. ప్రతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన.. కొత్త మున్సిపల్ చట్ట ముసాయిదా రూపకల్పన, నూతన సెక్రటేరియట్ భవన నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. ప్రస్తుతమున్న సెక్రటేరియట్ భవనాన్ని తొలగించడానికి ఎంతకాలం పడుతుందో అంచనా వేయాలని, అలాగే కొత్త సెక్రటేరియట్ భవనంలో అన్ని సౌకర్యాల కల్పనకు ఎంత ఖర్చవుతుందో ఇప్పటినుంచే ఓ అవగాహనకు రావాలని కేసీఆర్ సూచించారు. వర్షాకాల సీజన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలను మదింపు చేసుకోవాలని కోరారు.