AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొన్న సినిమా..నేడు దోసె …సీన్ మారింది…

కామన్ మ్యాన్ లా మొన్న హిందీ మూవీ.. ‘ ఆర్టికల్-15 ‘ ని ఢిల్లీలోని ఓ థియేటర్ లో చూసిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తాజాగా పాట్నాలోని ఓ చిన్న రెస్టారెంట్ లో దోసె తింటూ కనిపించారు. (బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన ఆ సినిమా రాహుల్ ని ఇంప్రెస్ చేసింది మరి) ! పరువు నష్టం కేసులో పాట్నాలోని కోర్టు బెయిలు మంజూరు చేయడంతో.. రాహుల్ ఢిల్లీ వెళ్ళడానికి విమానాశ్రయానికి […]

మొన్న సినిమా..నేడు దోసె ...సీన్ మారింది...
Pardhasaradhi Peri
|

Updated on: Jul 07, 2019 | 12:34 PM

Share

కామన్ మ్యాన్ లా మొన్న హిందీ మూవీ.. ‘ ఆర్టికల్-15 ‘ ని ఢిల్లీలోని ఓ థియేటర్ లో చూసిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తాజాగా పాట్నాలోని ఓ చిన్న రెస్టారెంట్ లో దోసె తింటూ కనిపించారు. (బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన ఆ సినిమా రాహుల్ ని ఇంప్రెస్ చేసింది మరి) ! పరువు నష్టం కేసులో పాట్నాలోని కోర్టు బెయిలు మంజూరు చేయడంతో.. రాహుల్ ఢిల్లీ వెళ్ళడానికి విమానాశ్రయానికి వెళ్లేముందు.. ఈ హోటల్ చేరుకొని అక్కడ సౌతిండియన్ డిష్ అయిన దోసెను ఇష్టంగా తిన్నారు. ఆయన వెంట ఏఐసీసీ అధికార ప్రతినిధి శక్తి సింగ్ గోహిల్, రాష్ట్ర పార్టీ చీఫ్ మదన్ మోహన్ ఝా తదితరులున్నారు. రాహుల్ దోసె తినడాన్ని పలువురు జర్నలిస్టులు ఎంచక్కా ఫోటోలు తీసుకున్నారు. ఆయన సెక్యూరిటీ కూడా ఇందుకు అనుమతినిచ్చింది. ‘ దొంగలందరికీ ఇంటిపేరు మోదీ ‘ అని ఉంటుందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గాను బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ ఆయనపై పరువునష్టం దావా వేశారు. దీన్ని విచారించిన పాట్నాకోర్టు.. రూ. 10 వేల పూచీకత్తుపై ఆయనకు బెయిలు మంజూరు చేసింది. మోదీ ప్రభుత్వానికి గానీ, బీజేపీ-ఆర్ఎస్సెస్ కి గానీ ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిని మోదీ సర్కార్ కోర్టు కేసులతో భయపెడుతుందని రాహుల్ దుయ్యబట్టారు.

పొంగల్ పండుగ జరుపుకున్న ప్రధాని మోదీ
పొంగల్ పండుగ జరుపుకున్న ప్రధాని మోదీ
వరుణ్ సందేశ్ వైఫ్ యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుందంటే.?
వరుణ్ సందేశ్ వైఫ్ యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుందంటే.?
ఒకప్పుడు చంద్రబాబు ప్రొటోకాల్ ఆఫీసర్.. ఇప్పుడు స్టార్ యాక్టర్
ఒకప్పుడు చంద్రబాబు ప్రొటోకాల్ ఆఫీసర్.. ఇప్పుడు స్టార్ యాక్టర్
సముద్రంలో అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. అమేజింగ్ వీడియో
సముద్రంలో అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. అమేజింగ్ వీడియో
10,000 అడుగుల మ్యాజిక్.. రోజూ నడిస్తే మీ శరీరంలో జరిగే అద్భుత..
10,000 అడుగుల మ్యాజిక్.. రోజూ నడిస్తే మీ శరీరంలో జరిగే అద్భుత..
సంక్రాంతి నాడు నువ్వుల లడ్డు ఎందుకు తింటారు? ప్రాముఖ్యత తెలుసా?
సంక్రాంతి నాడు నువ్వుల లడ్డు ఎందుకు తింటారు? ప్రాముఖ్యత తెలుసా?
పాము కాటేసిందనీ.. చొక్కా జేబులో వేసుకుని ఆస్పత్రికెళ్లాడు! వీడియో
పాము కాటేసిందనీ.. చొక్కా జేబులో వేసుకుని ఆస్పత్రికెళ్లాడు! వీడియో
చైనీస్ మాంజాను ఏలా రక్షించుకోవాలో తెలుసా?
చైనీస్ మాంజాను ఏలా రక్షించుకోవాలో తెలుసా?
పొట్ట ఐస్‌లా కరగాల్సిందే.. రోజూ సోంపును ఇలా తీసుకుంటే అద్భుతాలే..
పొట్ట ఐస్‌లా కరగాల్సిందే.. రోజూ సోంపును ఇలా తీసుకుంటే అద్భుతాలే..
టాస్ గెలిచిన కివీస్..బ్యాటింగ్‌కు దిగనున్న టీమిండియా
టాస్ గెలిచిన కివీస్..బ్యాటింగ్‌కు దిగనున్న టీమిండియా