రాజీనామా దిశగా కుమారస్వామి..?

| Edited By: Srinu

Jul 11, 2019 | 1:10 PM

కర్నాటకలో అసమ్మతి, ఆకర్ష్ పరిణామాలతో సంకీర్ణ సర్కార్ ప్రయాణం చివరి అంకానికి చేరింది. అధికారపక్ష బలం 101కు పడిపోగా.. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో 107 సంఖ్యాబలం గల బీజేపీ బల నిరూపణకు పట్టుబట్టనుంది. ఇక తాజా పరిణామాలతో పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన సీఎం కుమారస్వామి ఇవాళ రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నారు. అదే సమయంలో అసెంబ్లీని రద్దు చేసే యోచనలో సీఎం కుమారస్వామి ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో కర్నాటక కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో అసెంబ్లీని రద్దు […]

రాజీనామా దిశగా కుమారస్వామి..?
Follow us on

కర్నాటకలో అసమ్మతి, ఆకర్ష్ పరిణామాలతో సంకీర్ణ సర్కార్ ప్రయాణం చివరి అంకానికి చేరింది. అధికారపక్ష బలం 101కు పడిపోగా.. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో 107 సంఖ్యాబలం గల బీజేపీ బల నిరూపణకు పట్టుబట్టనుంది. ఇక తాజా పరిణామాలతో పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన సీఎం కుమారస్వామి ఇవాళ రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నారు. అదే సమయంలో అసెంబ్లీని రద్దు చేసే యోచనలో సీఎం కుమారస్వామి ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో కర్నాటక కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో అసెంబ్లీని రద్దు చేసే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటివరకు 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ఆమోదించేది లేదని స్పీకర్ రమేశ్ కుమార్ తేల్చిచెప్పడంతో వారంతా కోర్టును ఆశ్రయించారు.

మరోవైపు కుమారస్వామి రాజీనామా వ్యూహంతో బీజేపీ నేతలు కలవరపడుతున్నారు. నిన్నంతా ధర్నాలతో హోరెత్తించిన కమలదళం తాజాగా కౌంటర్ వ్యూహానికి పదునుపెడుతోంది. 15 నెలలలోపే మరోసారి అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని భావిస్తోంది కమలదళం. మధ్యంతర ఎన్నికలకు తాము కారణం కాదని, కాంగ్రెస్, జేడీఎస్ నేతల మధ్య సఖ్యత లేకపోవడం వల్లనే అసెంబ్లీ రద్దు దిశగా అడుగులు పడుతన్నాయని ప్రజలకు తెలిసేలా కమలనాథులు వ్యూహారచన చేస్తున్నారు.

ఇదిలా వుంటే కుమారస్వామి రాజీనామా మాత్రమే చేయాలని, అసెంబ్లీని రద్దు చేయవద్దని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కుమారస్వామి రాజీనామా చేస్తే.. జేడీఎస్ సర్కార్‌తో ఏర్పాటయ్యే అవకాశాలను కాంగ్రెస్ అగ్రనేతలు పరిశీలిస్తున్నారు. రెబల్ ఎమెల్యేలందరికీ మంత్రి పదవులిస్తే వారు రాజీనామాలను ఉపసంహరించుకుంటారని, తద్వారా తగిన బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.