గుండెపోటుతో మరణించిన క‌ర్ణాటక మంత్రి శివల్లి

| Edited By:

Mar 22, 2019 | 4:57 PM

కర్ణాటక మున్సిపల్‌ శాఖ మంత్రి సీఎస్‌ శివల్లి(58) గుండెపోటుతో మరణించారు. తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ధార్వాడ్‌లో కొంతమంది ప్రజలతో మాట్లాడుతుండగా అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే అయనను హుబ్బల్లిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం శివల్లికి బైపాస్ సర్జరీ జరిగింది. గత మూడు రోజులుగా ధార్వాడ్‌లో భవనం కూలిన ప్రాంతంలో చేపట్టిన సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. 1999లో […]

గుండెపోటుతో మరణించిన క‌ర్ణాటక మంత్రి శివల్లి
Follow us on

కర్ణాటక మున్సిపల్‌ శాఖ మంత్రి సీఎస్‌ శివల్లి(58) గుండెపోటుతో మరణించారు. తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ధార్వాడ్‌లో కొంతమంది ప్రజలతో మాట్లాడుతుండగా అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే అయనను హుబ్బల్లిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం శివల్లికి బైపాస్ సర్జరీ జరిగింది. గత మూడు రోజులుగా ధార్వాడ్‌లో భవనం కూలిన ప్రాంతంలో చేపట్టిన సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తున్నారు.

1999లో శివల్లి తొలిసారి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఆయన 2008 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 2013, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఇటీవల కర్ణాటక కేబినెట్‌ విస్తరణలో ఆయనకు మంత్రిగా అవకాశం వచ్చింది.