
బ్రిటన్ లో తలెత్తిన మ్యుటెంట్ కరోనా వైరస్ నేపథ్యంలో కర్నాటకలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకు కర్ఫ్యూ విధించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కర్ఫ్యూను అమలు చేస్తామని సీఎం ఎడియూరప్ప ప్రకటించారు. జనవరి 2 వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆయన చెప్పారు. యూకేలో కనుగొన్న స్ట్రెయిన్ కు సంబంధించి వస్తున్న వార్తలతో తాము అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ తోను, టెక్నీకల్ కమిటీతోను సమావేశమై.. కోవిడ్ ప్రొటొకాల్స్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఇక ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉంటున్నామని, ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటరింగ్ చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు. డిసెంబరు 23-జనవరి 2 మధ్య రాత్రి 10 గంటల అనంతరం ఎలాంటి ఫంక్షన్లను గానీ, పండుగ సంబంధ కార్యక్రమాలను గానీ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.
అంటే ఇక క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను కూడా అనుమతించబోమని పరోక్షంగా స్పష్టం చేశారు.