Australia vs India: రెండో టెస్టుకు డేవిడ్ వార్నర్ దూరం… ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు…

ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ భారత్‌తో జరిగే రెండో టెస్టుకు కూడా దూరంకానున్నాడు.

Australia vs India: రెండో టెస్టుకు డేవిడ్ వార్నర్ దూరం... ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 23, 2020 | 2:05 PM

ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ భారత్‌తో జరిగే రెండో టెస్టుకు కూడా దూరంకానున్నాడు. భారత్‌తో సిరీస్‌లో భాగంగా వార్నర్ రెండో వన్డేలో గాయపడ్డాడు. అయితే తొడకండరాల గాయంతో ఇప్పటికే వార్నర్ ఆఖరి వన్డే, టీ20 సిరీస్‌, తొలి టెస్టుకు దూరమయ్యాడు. వార్నర్‌ పూర్తిగా కోలుకోవడానికి మరికాస్త సమయం పడుతుందని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) తెలిపింది.

మరోవైపు పేసర్‌ సీన్‌ అబాట్‌ కూడా బాక్సింగ్ డే టెస్టుకు అందుబాటులో ఉండట్లేదని వెల్లడించింది. వీరిద్దరు సిడ్నీలో ఫిట్‌నెస్‌ మెరుగు కోసం సాధన చేశారు. కానీ, ఆ నగరంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో జట్టుకు దూరం కావాల్సివచ్చింది. కాగా, డిసెంబర్‌ 26 మెల్‌బోర్న్‌ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో 0-1తో భారత్ వెనకబడి ఉంది.