సీరియల్‌ని తలపిస్తున్న కర్నాటకం.. బలపరీక్ష ఇవాళ్టికి వాయిదా
కన్నడ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. సంకీర్ణపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. సీరియల్ ను తలపిస్తున్న పొలిటికల్ డ్రామా ఇవాళ కూడా కొనసాగనుంది. రెండు రోజుల విరామం అనంతరం సోమవారం సభ ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు బలపరీక్ష నిర్వహించాలని పట్టుబట్టారు. మరోవైపు సభను వాయిదా వేయాలని కాంగ్రెస్-జేడీ(ఎస్) సభ్యులు నినాదాలు చేశారు. అధికార, విపక్ష సభ్యుల నినాదాలతో అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే విశ్వాస పరీక్షను సోమవారం పూర్తి చేస్తామని సీఎం కుమారస్వామి హామీనిచ్చారని.. […]

కన్నడ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. సంకీర్ణపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. సీరియల్ ను తలపిస్తున్న పొలిటికల్ డ్రామా ఇవాళ కూడా కొనసాగనుంది. రెండు రోజుల విరామం అనంతరం సోమవారం సభ ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు బలపరీక్ష నిర్వహించాలని పట్టుబట్టారు. మరోవైపు సభను వాయిదా వేయాలని కాంగ్రెస్-జేడీ(ఎస్) సభ్యులు నినాదాలు చేశారు. అధికార, విపక్ష సభ్యుల నినాదాలతో అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే విశ్వాస పరీక్షను సోమవారం పూర్తి చేస్తామని సీఎం కుమారస్వామి హామీనిచ్చారని.. ఆ మాట ప్రకారం ఇవాళే బలపరీక్ష నిర్వహించాలని.. ప్రతిపక్ష నేత యడ్యూరప్ప డిమాండ్ చేశారు. విశ్వాస పరీక్ష కోసం తాము ఉదయం 12 గంటల వరకు సభలో ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే స్పీకర్ రాత్రి 11.40 గంటలకు సభను మంగళ వారానికి వాయిదా వేశారు. చాలా మంది సీనియర్లు ఉన్నారని.. పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఉన్నారంటూ సభను ఇవాళ్టికి వాయిదా వేశారు. ఇవాళ ఉదయం తిరిగి ఉదయం 10.00 గంటలకు తిరిగి అసెంబ్లీ ప్రారంభం కానుంది. సాయంత్రం 4.00 గంటల నుంచి 6.00 గంటల వరకు బలపరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఇవాళ సభలో ఎలాంటి మాటలయుద్ధం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా చేస్తున్నారు.