AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీడియాపై ప్రశాంత్‌ కిషోర్ ఫైర్!

దిగ్గజ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ మీడియా, వార్తా పత్రికలపై మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన శివసేన యువనేత ఆదిత్య ఠాక్రేతో కలిసి పనిచేస్తున్నారని ఓ పత్రిక రాసింది. ఆ వార్తను ఉద్దేశిస్తూ ప్రశాంత్‌ మాట్లాడారు. తనకు మీడియా అంటే ఎంతో గౌరవం ఉందని, ఇలాంటి వార్తల గురించి విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘నిజం చెప్పాలంటే ఈ మధ్య నేను ఎక్కడ పనిచేస్తున్నానో నాకంటే బాగా మీడియాకే తెలుస్తోంది. వార్తా పత్రికల్లో చదవి […]

మీడియాపై ప్రశాంత్‌ కిషోర్ ఫైర్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 23, 2019 | 4:28 AM

Share

దిగ్గజ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ మీడియా, వార్తా పత్రికలపై మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన శివసేన యువనేత ఆదిత్య ఠాక్రేతో కలిసి పనిచేస్తున్నారని ఓ పత్రిక రాసింది. ఆ వార్తను ఉద్దేశిస్తూ ప్రశాంత్‌ మాట్లాడారు. తనకు మీడియా అంటే ఎంతో గౌరవం ఉందని, ఇలాంటి వార్తల గురించి విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘నిజం చెప్పాలంటే ఈ మధ్య నేను ఎక్కడ పనిచేస్తున్నానో నాకంటే బాగా మీడియాకే తెలుస్తోంది. వార్తా పత్రికల్లో చదవి తెలుసుకోవాల్సి వస్తోంది’ అని అన్నారు. ఈ విషయంపై ఆయన ట్విటర్‌లోనూ స్పందించారు. ఈయన ఐపాక్‌(భారత రాజకీయ కార్యాచరణ కమిటీ) పేరుతో ఓ బృందాన్ని నడుపుతున్నారు. రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ఈయన పశ్చిమ బెంగాల్‌ అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్ కోసం పనిచేయనున్నారు.

https://twitter.com/PrashantKishor/status/1153190271120596992