మా అధ్యక్షుడి పొరబాటిది.. ప్లీజ్..సారీ !

కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి భారత ప్రధాని మోదీ తన మధ్యవర్తిత్వాన్ని కోరారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన పట్ల అమెరికా కాంగ్రెస్ లో అనేకమంది సభ్యులు తీవ్ర వ్యతిరేకత వెలిబుచ్చారు. ముఖ్యంగా సెనేట్ లో ఓ కీలక పదవిలో ఉన్న డెమొక్రటిక్ సెనెటర్ బ్రాడ్ షెర్మన్.. ఇందుకు అమెరికాలో భారత రాయబారి హర్ష ష్రిమ్గాలకు అపాలజీ చెప్పారు. ‘ మా దేశాధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చిన్నపిల్లాడి చేష్టలా, మిమ్మల్ని ఇరకాటాన బెట్టే పొరబాటు చర్యలా […]

మా అధ్యక్షుడి పొరబాటిది.. ప్లీజ్..సారీ !
Follow us

|

Updated on: Jul 23, 2019 | 12:40 PM

కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి భారత ప్రధాని మోదీ తన మధ్యవర్తిత్వాన్ని కోరారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన పట్ల అమెరికా కాంగ్రెస్ లో అనేకమంది సభ్యులు తీవ్ర వ్యతిరేకత వెలిబుచ్చారు. ముఖ్యంగా సెనేట్ లో ఓ కీలక పదవిలో ఉన్న డెమొక్రటిక్ సెనెటర్ బ్రాడ్ షెర్మన్.. ఇందుకు అమెరికాలో భారత రాయబారి హర్ష ష్రిమ్గాలకు అపాలజీ చెప్పారు. ‘ మా దేశాధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చిన్నపిల్లాడి చేష్టలా, మిమ్మల్ని ఇరకాటాన బెట్టే పొరబాటు చర్యలా ఉందన్నారు. అసలు కాశ్మీర్ అంశంపై మూడో వ్యక్తి జోక్యమే అనవసరమన్న భారత ప్రభుత్వ వైఖరిని పలువురు ఇతర సభ్యులు కూడా సమర్థించారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మోదీ తన జోక్యాన్ని కోరారన్నట్రంప్ వ్యాఖ్యలకు సారీ చెబుతున్నానని షెర్మన్ ట్వీట్ చేశారు.

దక్షిణాసియాలో విదేశాంగ విధానం గురించి అందరికీ తెలిసిందేనని, కాశ్మీర్ విషయంలో మోదీ అలాంటి కోర్కెను కోరబోరన్న అంశం ప్రతివారికీ స్పష్టమేనని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. గత 70 ఏళ్లుగా ఈ సమస్యపై మూడో పక్షం జోక్యాన్ని భారత్ తిరస్కరిస్తూ వస్తోంది. అయితే ఇది ద్వైపాక్షికమైనదని, భారత్-పాక్ దేశాలు కలిసి, కూచుని పరిష్కరించుకోవాలని అమెరికా కొన్ని సంవత్సరాలుగా కోరుతోంది.. కాగా-అమెరికా ప్రతినిధుల సభలో ఆసియాకు సంబంధించి విదేశాంగ వ్యవహారాలపై గల సబ్-కమిటీకి చైర్మన్ గా ఉన్న షెర్మన్.. అసలు భారత ప్రధాని మోదీ..ఇలాంటి కోర్కెను కోరతారా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇండియా ఇలాంటి ప్రతిపాదనను ఏనాడో తిరస్కరించిందన్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో జరిపిన సమావేశంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత-అమెరికా సంబంధాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ మాజీ దౌత్యప్రతినిధి అలీసా ఐర్స్ సైతం ఖండించారు.

ఇమ్రాన్ ఖాన్ తో జరిపిన సమావేశానికి వచ్ఛే ముందు బహుశా ట్రంప్ ప్రిపేర్ అయి వఛ్చినట్టు కనిపించలేదని ఆమె ఎద్దేవా చేశారు. నిజానికి ఇలాంటి వైఖరిని ఢిల్లీ అప్పుడే ఖండించిందని ఆమె పేర్కొన్నారు. పాకిస్థాన్ తో గల అన్ని అపరిష్కృత సమస్యలను తామే పరిష్కరించుకుంటామని భారత ప్రభుత్వం ఏనాడో స్పష్టం చేసిందన్నారు. ఇండియాకు అమెరికా మాజీ రాయబారి రిచర్డ్ వర్మ కూడా ట్రంప్ వ్యాఖ్యలను తోసిపుచ్చడం విశేషం.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!