AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధర్మేగౌడ డెత్ మిస్టరీ.. వివాదాస్పదంగా మారుతున్న కర్ణాటక మండలి డిప్యూటీ స్పీకర్ మృతి..

Karnataka Deputy Speaker: క‌ర్ణాట‌క శాస‌న మండ‌లి డిప్యూటీ స్పీకర్‌ ధర్మేగౌడ మృతిపై ఆందోళన నెలకొంది. ఈ ఘటనను పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ధర్మేగౌడ డెత్ మిస్టరీ.. వివాదాస్పదంగా మారుతున్న కర్ణాటక మండలి డిప్యూటీ స్పీకర్ మృతి..
Ravi Kiran
|

Updated on: Dec 29, 2020 | 1:35 PM

Share

Karnataka Deputy Speaker: క‌ర్ణాట‌క శాస‌న మండ‌లి డిప్యూటీ స్పీకర్‌ ధర్మేగౌడ మృతిపై ఆందోళన నెలకొంది. ఈ ఘటనను పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ధర్మేగౌడ మృతిపై రాజకీయ ప్రముఖులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శాసనమండలిలో చోటు చేసుకున్న గొడవ కారణంగా తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారా.? లేక కుట్ర కోణం ఏదైనా ఉందా.? అసలు ఆ సూసైడ్ నోట్‌లో ఏముంది.? ఇలా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Dec 2020 01:25 PM (IST)

    ధర్మేగౌడ మృతిపై కర్ణాటక హోంమంత్రి కీలక కామెంట్స్..

    ధర్మేగౌడ మృతిపై కర్ణాటక హోంమంత్రి బస్వరాజు బొమ్మాయి కీలక ప్రకటన చేశారు. డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ మృతిపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ధర్మేగౌడ సూసైడ్ నోట్‌లో అనేక విషయాలు ఉన్నాయి. ఆ అంశాలపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోందని స్పష్టం చేశారు.

  • 29 Dec 2020 12:15 PM (IST)

    ధర్కమేగౌడది ఆత్మహత్య కాదు.. రాజకీయ హత్య.. కర్ణాటక మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి

    ధర్మేగౌడ మృతిపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిష్కల్మషమైన వ్యక్తిత్వం కలిగిన రాజకీయ నాయకుడిని కోల్పోయాం. ధర్మేగౌడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నా మిత్రుడి నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. తన కొడుకును మంత్రిగా చూడాలని ధర్మేగౌడ తండ్రి లక్ష్మయ్య తనతో ఎప్పుడు చెప్పేవాడని గుర్తు చేసుకున్నారు. కానీ అతని కోరిక తీరలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఆత్మహత్య కాదని ధర్మేగౌడది రాజకీయ హత్యే అని ఆరోపించారు.

  • 29 Dec 2020 11:33 AM (IST)

    ధర్మేగౌడ సూసైడ్‌పై అనేక ప్రశ్నలు.. అసలు ఇది ఆత్మహత్యా.? హత్యా.?

    ధర్మేగౌడ సూసైడ్ అంశం ప్రస్తుతం కర్ణాటక పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయింది. ఘటనాస్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్ ఇంకా బయటికి రాకపోవడంతో పలు కుట్ర కోణాలు, అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టుమార్టం అనంతరం ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే అవకాశం ఉంది.

  • 29 Dec 2020 10:53 AM (IST)

    ఉపసభాపతి అకాల మరణంపై మాజీ ప్రధాని దేవెగౌడ దిగ్భ్రాంతి

    ఉపసభాపతి అకాల మరణంపై మాజీ ప్రధాని దేవెగౌడ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ధర్మె గౌడ ప్రశాంతమైన వ్యక్తి అని.. రాష్ట్రం ఓ మంచి నేతను కోల్పోయిందని పేర్కొన్నారు.

  • 29 Dec 2020 10:40 AM (IST)

    ఆ రోజు మండలిలో రాద్ధాంతం ఎందుకు జరిగిందంటే..

    కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉంది. అంతకుముందు కాంగ్రెస్-జేడీఎస్‌ ప్రభుత్వం కొనసాగింది. బీజేపీ బలం పెరగటంతో సీట్లు తారుమారయ్యాయి. మండలిలో కాంగ్రెస్ నేత ప్రతాప్‌చంద్రశెట్టి చైర్మన్‌గా ఉన్నారు. జేడీఎస్‌కు చెందిన ధర్మగౌడ డిప్యూటీ చైర్మన్‌. అసెంబ్లీలో మాట నెగ్గించుకుంటున్న బీజేపీకి.. మండలిలో ముందరి కాళ్లకు బంధం పడుతోంది. తమ పంతం నెగ్గించుకునేందుకు అడ్డుపడుతున్న మండలి చైర్మన్ ప్రతాప్‌చంద్ర శెట్టిని పదవి నుంచి దించేందుకు బీజేపీ ఎమ్మెల్సీలు అవిశ్వాస నోటీసు ఇచ్చారు. ఆ నోటీసుపై మండలిలో రాద్ధాంతం జరిగింది. మండలి చైర్మన్‌ సీట్లో డిప్యూటీ చైర్మన్‌ని కూర్చోబెట్టి నో కాన్ఫిడెన్స్‌ మోషన్‌ని బీజేపీ ఎమ్మెల్సీలు మూవ్‌ చేశారు. దీంతో కాంగ్రెస్‌ నేతలకు ఇబ్బందిగా మారింది. బీజేపీకి మద్దతిస్తున్నాడంటూ డిప్యూటీ చైర్మన్‌ ధర్మగౌడని కుర్చీలోంచి కిందికి లాగేశారు. ఇది పెద్ద రచ్చకు దారితీసింది. కర్నాటక కౌన్సిల్‌ తీరుపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసందే..

  • 29 Dec 2020 10:35 AM (IST)

    అసలు మండలిలో ఏం జరిగింది..

    డిసెంబర్ 15న కర్ణాటక విధాన పరిషత్ సమావేశాల్లో రసాభాస చోటు చేసుకుంది. చైర్మన్ ప్రతాపచంద్ర శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభ్యులు వాగ్వాదానికి దిగారు. సభాపతి స్థానంలో ఉన్న ధర్మె గౌడను తోసేశారు.

  • 29 Dec 2020 10:32 AM (IST)

    మండలిలో ఘటన జరిగిన 15 రోజుల తర్వాత ధర్మేగౌడ సూసైడ్ ఎందుకు చేసుకుంటారు.? జేడీఎస్

    ధర్మేగౌడ మృతిపై జేడీఎస్‌ పార్టీలో పలు ప్రశ్నలు తలెత్తాయి. మండలిలో ఘటన జరిగిన 15 రోజుల తర్వాత ధర్మేగౌడ సూసైడ్ ఎందుకు చేసుకుంటారు.? అలాగే సూసైడ్ నోట్ ఇంకా బయటికి రాకపోవడంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సూసైడ్ చేసుకునేంత పిరికివాడు ధర్మగౌడ కాదంటూ సొంత పార్టీ నేతలు అంటున్నారు.

  • 29 Dec 2020 10:25 AM (IST)

    ధర్మగౌడ సూసైడ్‌లో ట్విస్ట్.. పలు అనుమానాలు..

    కర్ణాటక శాసనమండలి డిప్యూటీ స్పీకర్ ధర్మేగౌడ సూసైడ్‌లో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ధర్మేగౌడ మరణం వెనుక కుట్ర కోణం ఉందని.. రాజకీయ పరమైన అనుమానాలు ఉన్నాయని తెలుస్తోంది. ధర్మేగౌడను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారా.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • 29 Dec 2020 10:17 AM (IST)

    ధర్మేగౌడ మృతదేహం వద్ద లభ్యమైన సూసైడ్ నోట్..

    ధర్మేగౌడ మృతదేహం వద్ద పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యమైంది. తాజాగా జరిగిన మండలి గొడవ, ఆర్ధిక లావాదేవీలపై ఆ సూసైడ్ నోట్‌ ధర్మేగౌడ ప్రస్తావించినట్లు పోలీసులు చెబుతున్నారు.

  • 29 Dec 2020 10:09 AM (IST)

    కర్ణాటక డిప్యూటీ స్పీకర్ ధర్మేగౌడ మృతి.. వెలుగులోకి వస్తోన్న కీలక విషయాలు..

    నిన్న రాత్రి 7 గంటల సమయంలో ధర్మేగౌడ రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తాను ప్రైవేట్‌గా ఫోన్ మాట్లాడుకోవాలని చెప్పి డ్రైవర్, గన్‌మాన్‌లను అక్కడ నుంచి పంపించేశారు. ఆ తర్వాత రాత్రి 10 గంటలకు ఆయన ఫోన్‌కు ట్రై చేయగా.. స్విచ్ ఆఫ్ రావడంతో గన్​మెన్, డ్రైవర్ పోలీసులు ఆయన కోసం వెతికారు. వారికి ఉదయం చిక్కమంగ‌ళూరు కడూర్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్​పై ధర్మేగౌడ మృతదేహం కనిపించింది.

  • 29 Dec 2020 10:01 AM (IST)

    కర్ణాటక డిప్యూటీ స్పీకర్ ధర్మేగౌడ మృతి..

    నిన్న సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు జేడీఎస్‌ ఎమ్మెల్సీ ధర్మెగౌడ..ఇవాళ ఉదయం చిక్‌మగ్‌ళూరు జిల్లా కదుర్‌ తాలూకా గుణసాగర్‌ సమీపంలో రైల్వేట్రాక్‌పై మృతి చెంది కనిపించారు. నిన్న రాత్రి నుంచి ధర్మెగౌడ గన్​మెన్, పోలీసులు ఆయన కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. ఉదయం ధర్మె గౌడ మృతదేహం రైల్వే ట్రాక్​పై కనిపించింది.