మరో ఎమ్మెల్యే ఔట్.. కొనసాగుతున్న రాజీనామాల పరంపర..

| Edited By:

Jul 08, 2019 | 1:49 PM

కర్నాటక రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు సీఎల్పీ నేత సిద్ధా రామయ్యకు రాజీనామాలు ఇచ్చారు. ఇదిలా వుండగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నగేష్ సంకీర్ణ ప్రభుత్వానికి గుడ్ బై చెప్పారు. మంత్రిగా ఉన్న ఆయన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రం అందజేశారు. బీజేపీకి మద్దతు ప్రకటించారు. మరోవైపు ముంబైలో ఉన్న రెబల్స్ ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. కాగా, […]

మరో ఎమ్మెల్యే ఔట్.. కొనసాగుతున్న రాజీనామాల పరంపర..
Follow us on

కర్నాటక రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు సీఎల్పీ నేత సిద్ధా రామయ్యకు రాజీనామాలు ఇచ్చారు. ఇదిలా వుండగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నగేష్ సంకీర్ణ ప్రభుత్వానికి గుడ్ బై చెప్పారు. మంత్రిగా ఉన్న ఆయన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రం అందజేశారు. బీజేపీకి మద్దతు ప్రకటించారు. మరోవైపు ముంబైలో ఉన్న రెబల్స్ ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. కాగా, తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జేడీఎస్ క్యాంపు పాలిటిక్స్‌కు తెరతీసింది. ఈ నేపథ్యంలో ఇవాళ తమ ఎమ్మెల్యేలను బెంగళూరు శివారులోని కూర్గ్ రిసార్ట్స్‌కు తరలించే ప్రయత్నం చేస్తోంది. ఇటు మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుంటే, ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాము ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని బీజేపీ నేత శోభా అన్నారు. జేడీఎస్, కాంగ్రెస్‌లో అసంతృప్తి వల్లే రాజకీయ సంక్షోభం ఏర్పడిందని అన్నారు.